
క్వాల్‌కామ్ కొత్త ప్రాసెసర్లు
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ ప్రాసెసర్ల సంస్థ క్వాల్‌కామ్ రెండు కొత్త ప్రాసెసర్లను ఆవిస్కరించింది. సింగపూర్‌లో జరిగిన 'టెక్-డే' కార్యక్రమంలో స్నాప్‌డ్రాగన్ 630, 660లను సంస్థ వైస్ ఛైర్మెన్ కేదార్ కొందప్ ఆవిస్కరించారు. ఇందులో 4కె వీడియోని రికార్డు చేసుకొనే సామర్థ్యం ఉంది. 8జీబీ ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. స్నాప్‌డ్రాగన్660, 2కెవీడియోని సోర్టు చేస్తుంది.
ఈ రెండు ప్రాసెసర్లు ఎక్స్-12 ఎల్టీఈ సామర్థ్యంతో పనిచేస్తాయి. 600 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడును సపోర్టు చేస్తాయి. వీటిలో క్విక్ చార్జింగ్ 4.0ను నిక్షిప్తం చేశారు. కేవలం 5 నిమిశాలు చార్జింగ్‌తో 5గంటలు మాట్లాడుకోవచ్చు. 50శాతం బ్యాటరీ కేవలం 15నిమిశాల్లో ఎక్కుతుంది. ఇవి బ్లూటూత్ 5.0ని సపోర్టు చేస్తాయి. ఈరెండిటిని స్నాప్‌డ్రాగన్ న్యూరల్ ప్రాసెసింగ్ ఎస్‌డీకే ఉపయోగించి తయారుచేశారు.
క్వాల్‌కామ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఈ ప్రాసెసర్లు సరికొత్త అనుభవాలను అందిస్తాయిని, వేగవంతమైన ఎల్టీఈ డౌన్లోడ్ స్పీడు అందిస్తాయని తెలిపారు. ఎక్కువ మందికి హైక్వాలిటీ కెమెరా, ఆడియో, వీడియో, కనెక్టివిటీ అనుభూతులను పొందుతారని తెలిపారు. మెరుగైన సీపీయూ, గ్రాఫిక్స్ పనితీరు, వేగవంతమైన చార్జింగ్, భద్రతా వీటి సొంతం అని కేదార్ తెలిపారు. స్నాప్‌డ్రాగన్ 660 జూన్‌లో, స్నాప్‌డ్రాగన్ 630లు డిసెంబర్‌లో అందుబాటులోకి రానున్నాయి.