
రెడ్‌మీ 2021లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత నడిచే ఒక మొబైల్ ఫోన్ అయిన తీసుకురావాలని భావిస్తుంది. అందుకోసమే రెడ్‌మీ కే 30ప్రోకి సక్సెర్ గా రాబోయే కే40 ప్రోలో దీనిని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు వచ్చిన కొన్ని లీక్స్ ప్రకారం కే40ప్రో స్మార్ట్ ఫోన్ నాచ్-తక్కువ ఉన్న ప్యానల్‌తో లేదా పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇటీవల ఒక టిప్ స్టార్ తెలిపిన ప్రకారం రెడ్‌మి కే 40 ప్రోలో 3.7 మిమీ పరిమాణంలో ఉండే స్లిమ్ పంచ్-హోల్‌తో ఓఎల్ఈడీ ప్యానెల్ తో రానున్నట్లు పేర్కొన్నారు. రెడ్‌మి కే 40ప్రో 90హెర్ట్జ్, 120హెర్ట్జ్ లేదా 144హెర్ట్జ్ అధిక రిఫ్రెష్ రేట్లతో రానుంది. రెడ్‌మి కే 40ప్రో మొబైల్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5జీ ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు సమాచారం. అలాగే ఇందులో 45000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. రెడ్‌మి కే 40ప్రోలో వచ్చే ప్రధాన కెమెరా రిజల్యూషన్ గురించి నివేదికలు ఏమీ పేర్కొనలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో లేదా చివరలో దీనిని తీసుకురానున్నట్లు సమాచారం. దీనిని చైనాలో మొట్ట మొదటగా సారిగా లాంచ్ చేయనున్నారు.(చదవండి: లెనోవా కొత్త స్మార్ట్‌ఫోన్లు)
Comments
Please login to add a commentAdd a comment