
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తాజాగా భారత మార్కెట్లో టీ1 5జీ ఫోన్‌ను ఆవిష్కరించింది. టీ సిరీస్‌లో ఇది మొదటి స్మార్ట్‌ఫోన్ అని సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్, వివో పోర్టల్, రిటైల్ స్టోర్స్‌లో దీని ధర రూ. 15,990 నుంచి రూ. 19,990 వరకూ ఉంటుంది.
ప్రత్యేక ఆఫర్లు వినియోగించుకుంటే రూ. 14,990కే పొందవచ్చని వివో వివరించింది. ప్రధానంగా యువతను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు తెలిపింది. రూ. 20,000 లోపు ధరలో ఇది అత్యంత పల్చని స్మార్ట్‌ఫోన్ అని పేర్కొంది.
ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ ఫోన్‌లో 50 ఎంపీ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫన్‌టచ్ ఓఎస్ 12 మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు రంగుల్లో (స్ట్రెయిట్ బ్లాక్, రెయిన్‌బో ఫ్యాంటసీ) లభిస్తుంది.
చదవండి: తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్‌తో ఐటెల్ ఇయర్ బడ్స్..! ధర ఏంతంటే..?