సాక్షి, న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దేశంలోని చైనా కంపెనీలకు భారీ షాకిస్తోంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో, దాని అనుభంధ కంపెనీలపై మంగళవారం దేశవ్యాప్తంగా 40 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది మనీలాండరింగ్ ఆరోపణలతో ఈ దాడులు చేస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్ల కింద ఈ సోదాలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.
టెలికాం మేజర్ వివో, దాని అనుబంధ సంస్థలపై ఈడీ 40కి పైగా ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తోంది. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ హర్యానా తదితర రాష్ట్రాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గత నెలలో, రెండు చైనా కంపెనీలు నకిలీ పత్రాలు, చిరునామాలతో అక్రమాలకు పాల్పడినట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించడంతో ఈడీ ఈ చర్యకు దిగింది. ఇప్పటికే జెడ్‌టీఈ కార్పొరేషన్, వివో మొబైల్ కమ్యూనికేషన్స్ కంపెనీ లోకల్ యూనిట్లు ఆర్థిక అవకతవకల విచారణను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మొబైల్ దిగ్గజం షావోమి కూడా ఈడీ విచారణలో ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment