వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌... | Vivo Z1 With 6.26-Inch Display Launched | Sakshi
Sakshi News home page

వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌...

Published Fri, May 25 2018 1:58 PM | Last Updated on Fri, May 25 2018 1:58 PM

Vivo Z1 With 6.26-Inch Display Launched - Sakshi

బీజింగ్‌: వివో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించింది. జెడ్‌సిరీస్‌లో  జెడ్‌ 1 పేరుతో   తొలి డివైస్‌ను లాంచ్‌ చేసింది.  ప్రధానంగా  కరెంట్‌  మార్కెట్‌ ట్రెండ్‌కు అనుగుణంగా  బిగ్‌ స్క్రీన్‌, ఫేస్‌ రికగ్నిషన్‌, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ సహా అద్బుత ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను  చైనాలో అందుబాటులోకి తెచ్చింది.   సుమారు రూ.19200లుగా దీని ధర ఉండనుంది.   అయితే భారత్‌ సహా ఇతర మార్కెట్లలో ఎపుడు విక్రయానికి రానుంది స్పష్టత లేదు.  బ్లాక్,  రెడ్,  బ్లూ  అనే  మూడు కలర్ ఈ డివైస్‌ వేరియంట్లలో లభిస్తుంది.

జెడ్‌ 1 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు
6.26 అంగుళాల భారీ స్క్రీన్
1080x2280 పిక్సెల్స్  రిజల్యూషన్
ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 660ఎస్‌ఓసీ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
256 దాకా విస్తరించుకునే అవకాశం
13 +2 మెగాపిక్సెల్ డ్యుయల్‌ రియర్‌ కెమెరా  విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
12ఎంపీ సెల్ఫీ కెమెరా  
3260 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement