Bigscreen
-
వివో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్...
బీజింగ్: వివో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించింది. జెడ్సిరీస్లో జెడ్ 1 పేరుతో తొలి డివైస్‌ను లాంచ్ చేసింది. ప్రధానంగా కరెంట్ మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా బిగ్ స్క్రీన్, ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ సహా అద్బుత ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అందుబాటులోకి తెచ్చింది. సుమారు రూ.19200లుగా దీని ధర ఉండనుంది. అయితే భారత్ సహా ఇతర మార్కెట్లలో ఎపుడు విక్రయానికి రానుంది స్పష్టత లేదు. బ్లాక్, రెడ్, బ్లూ అనే మూడు కలర్ ఈ డివైస్ వేరియంట్లలో లభిస్తుంది. జెడ్ 1 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6.26 అంగుళాల భారీ స్క్రీన్ 1080x2280 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 660ఎస్ఓసీ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 256 దాకా విస్తరించుకునే అవకాశం 13 +2 మెగాపిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 12ఎంపీ సెల్ఫీ కెమెరా 3260 ఎంఏహెచ్ బ్యాటరీ -
హాట్ కిస్!
ఎప్పుడొచ్చామన్నది కాదు... కిస్సు కిక్కెంచిందా లేదా అన్నదే పాయింటంటున్నారు బాలీవుడ్ తారలు. సీనియర్, జూనియర్ తేడా లేదు... బిగ్స్క్రీన్పై లిప్‌లాక్‌ల పంట పండించేస్తున్నారు. ఎంతగా అంటే... ఏటికేడు హాట్ కిస్ ఎవరిదని పోటీ పెట్టుకునేంతగా! పాపం ఇమ్రాన్ హష్మీపై ‘ముద్దుల హీరో’ అంటూ ముద్ర వేసేశారు గానీ... నిజానికి ఎవరు మాత్రం వెనక్కు తగ్గుతున్నారు చెప్పండి! ఇంతకీ చెప్పొచ్చేదేమంటే... కుర్ర హీరో వరుణ్‌ధావన్, యామీగౌతమ్లు తమ తాజా సినిమా ‘బాదల్పూర్’లో ఓ మాంచి స్టీమీ లిప్‌లాక్ సీన్‌ను అదరగొట్టేశారట. సినిమా భాషలో చెప్పాలంటే... అదే... కెమిస్ట్రీ... ఇద్దరి మధ్యా తెగ వర్కవుటయిందట. అంటే అన్నారంటారు గానీ.. స్క్రీన్మీదైతేనేం.. ముద్దు ముద్దు కాదా.. ఏంటీ.. అంటూ నిట్టూరుస్తున్నారు క్రిటిక్స్. -
వన్ మోర్!
బిగ్స్క్రీన్పై కమెడియన్... రియల్ లైఫ్‌లో విలన్లా ఉన్నాడు హాలీవుడ్ నటుడు బిల్ కాస్బీ. అతడి కీచక పర్వానికి బలైనవారు తవ్విన కొద్దీ వెలుగు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఇరవై మందికి పైగా ఈ లిస్టులో ఉండగా... తనపైనా అఘాయిత్యం చేశాడంటూ తాజాగా మరొకరు వచ్చి చేరారు. 1970లో మిచిగాన్ హోటల్ రూమ్‌లో బిల్ తనను బలాత్కరించాడని శామీ డేవిస్ జూనియర్ మాజీ ప్రియురాలు క్యాథరిన్ మెక్కీ ఆరోపించింది. ప్రస్తుతం ఈమెకు 65 ఏళ్లు. బిల్‌కు 77 ఏళ్లు. నాడు బిల్ తనను కలవాలంటూ హోటల్ రూమ్‌కు పిలిచాడని, వెళ్లిన వెంటనే తనపై అఘాయిత్యం చేశాడని పేర్కొంది. -
ఫాలోయింగ్ నాకే!
బిగ్స్క్రీన్లపై మెరిసే తారలు సామాజిక సైట్లలోనూ సత్తా చాటుతున్నారు. ట్విట్టర్లో దూసుకుపోతున్న బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్‌తో పోటీపడుతోంది ముద్దు గుమ్మ ప్రియాంకా చోప్రా. ఇప్పటికి 70 లక్షల మంది ఫాలోవర్స్‌తో సరికొత్త రికార్డు సృష్టించిందీ భామ. భారత్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీల్లో అమితాబ్ (10 మిలియన్), షారూఖ్ (9 మిలియన్), ఆమిర్ (8.46 మిలియన్), సల్మాన్ (8.28 మిలియన్) తరువాతి స్థానాన్ని ఆక్రమించింది ప్రియాంక. ‘అందరికీ ధన్యవాదాలు. రోజురోజుకూ నా కుటుంబం పెరుగుతోంది’ అంటూ ట్వీట్ చేసిందీ భామ. పోటీకి ఓకే! మిస్టర్ ‘పర్ఫెక్షనిస్ట్’ ఆమిర్‌ఖాన్ తాజా సంచలనం ‘పీకే’ గెటప్‌నకు గట్టి పోటీనే వచ్చింది. అడల్ట్ సినిమాల డెరైక్టర్ కాంతి షా రిలీజ్ చేసిన ‘ఓకే’ సినిమా పోస్టర్లో బీగ్రేడ్ తార పూనమ్ రాయ్ నగ్నంగా పోజిచ్చి పిచ్చిలేపింది. ‘పీకే’లో ఆమిర్ ట్రాన్సిస్టర్‌ను ఆచ్ఛాదనగా వాడుకుంటే... పూనమ్ కెమెరా వేలాడేసుకొని మతిపోగొడుతోంది. మొత్తానికి బాలీవుడ్ సూపర్‌స్టార్ పోజ్‌కు అచ్చుగుద్దినట్టు కాపీ కొట్టేసిన ఈ అమ్మడి స్టిల్ ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద ‘హాట్’ టాపిక్. ఇది ఓ సెక్స్‌వర్కర్ కథని దర్శకుడు చెబుతున్నాడు. బిగ్‌బాస్‌ను కాదన్న కేకే! పాత బాయ్ ఫ్రెండ్‌ను కెలికి పాత రోజులు గుర్తు చేయడమెందుకనుకుందో.. తాజా ప్రియుడు రణవీర్‌కు కోపం వస్తుందనో.. మొత్తానికి ‘బిగ్ బాస్’ షోలో తన చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’ ప్రమోషన్‌కు నో చెప్పింది క్యూటీ కత్రినాకైఫ్. చిత్ర నిర్మాతలు ఈ విషయమై కత్రినాను సంప్రదించినా ఒప్పుకోలేదట. కారణం.. బాయ్‌ఫ్రెండ్ రణవీర్‌ను అప్సెట్ చేయదలుచుకోకపోవడమేననేది ఓ పత్రిక కథనం. కొసమెరుపేమిటంటే హీరో హృతిక్‌రోషన్ కూడా.. తన చిత్రాన్ని టీవీ షోల్లో ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదనడం!