ఫాలోయింగ్ నాకే! | Priyanka Chopra hits 7 million fans on Twitter | Sakshi
Sakshi News home page

ఫాలోయింగ్ నాకే!

Published Mon, Sep 22 2014 12:26 AM | Last Updated on Wed, Apr 3 2019 7:07 PM

ఫాలోయింగ్ నాకే! - Sakshi

ఫాలోయింగ్ నాకే!

బిగ్‌స్క్రీన్లపై మెరిసే తారలు సామాజిక సైట్లలోనూ సత్తా చాటుతున్నారు. ట్విట్టర్‌లో దూసుకుపోతున్న బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్‌తో పోటీపడుతోంది ముద్దు గుమ్మ ప్రియాంకా చోప్రా. ఇప్పటికి 70 లక్షల మంది ఫాలోవర్స్‌తో సరికొత్త రికార్డు సృష్టించిందీ భామ. భారత్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీల్లో అమితాబ్ (10 మిలియన్), షారూఖ్ (9 మిలియన్), ఆమిర్ (8.46 మిలియన్), సల్మాన్ (8.28 మిలియన్) తరువాతి స్థానాన్ని ఆక్రమించింది ప్రియాంక. ‘అందరికీ ధన్యవాదాలు. రోజురోజుకూ నా కుటుంబం పెరుగుతోంది’ అంటూ ట్వీట్ చేసిందీ భామ.

పోటీకి ఓకే!
 మిస్టర్ ‘పర్‌ఫెక్షనిస్ట్’ ఆమిర్‌ఖాన్ తాజా సంచలనం ‘పీకే’ గెటప్‌నకు గట్టి పోటీనే వచ్చింది. అడల్ట్ సినిమాల డెరైక్టర్ కాంతి షా రిలీజ్ చేసిన ‘ఓకే’ సినిమా పోస్టర్‌లో బీగ్రేడ్ తార పూనమ్ రాయ్ నగ్నంగా పోజిచ్చి పిచ్చిలేపింది. ‘పీకే’లో ఆమిర్ ట్రాన్సిస్టర్‌ను ఆచ్ఛాదనగా వాడుకుంటే... పూనమ్ కెమెరా వేలాడేసుకొని మతిపోగొడుతోంది. మొత్తానికి బాలీవుడ్ సూపర్‌స్టార్ పోజ్‌కు అచ్చుగుద్దినట్టు కాపీ కొట్టేసిన ఈ అమ్మడి స్టిల్ ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద ‘హాట్’ టాపిక్. ఇది ఓ సెక్స్‌వర్కర్ కథని దర్శకుడు చెబుతున్నాడు.

బిగ్‌బాస్‌ను కాదన్న కేకే!
పాత బాయ్ ఫ్రెండ్‌ను కెలికి పాత రోజులు గుర్తు చేయడమెందుకనుకుందో.. తాజా ప్రియుడు రణవీర్‌కు కోపం వస్తుందనో.. మొత్తానికి ‘బిగ్ బాస్’ షోలో తన చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’ ప్రమోషన్‌కు నో చెప్పింది క్యూటీ కత్రినాకైఫ్. చిత్ర నిర్మాతలు ఈ విషయమై కత్రినాను సంప్రదించినా ఒప్పుకోలేదట. కారణం.. బాయ్‌ఫ్రెండ్ రణవీర్‌ను అప్‌సెట్ చేయదలుచుకోకపోవడమేననేది ఓ పత్రిక కథనం. కొసమెరుపేమిటంటే హీరో హృతిక్‌రోషన్ కూడా.. తన చిత్రాన్ని టీవీ షోల్లో ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదనడం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement