Market Trend
-
గణాంకాలు, ఫలితాలే దిక్సూచి
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను క్యూ4 ఫలితాలు, ఆర్థిక గణాంకాలు నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే పలు దిగ్గజాలు గతేడాది(2022–23) క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించాయి. వారాంతాన(13న) డీమార్ట్ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ క్యూ4 పనితీరు వెల్లడించింది. ఈ బాటలో బెర్జర్ పెయింట్స్, ఫైజర్ ఈ నెల 15న, బ్యాంక్ ఆఫ్ బరోడా, భారతీ ఎయిర్టెల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 16న, స్టేట్‌బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్, గెయిల్ ఇండియా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్(ఇండిగో) 18న, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, 19న ఫలితాలు విడుదల చేయనున్నాయి. ఈ జాబితాలో ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సైతం ఉన్నాయి. డీమార్ట్ ఫలితాల ప్రభావం నేటి(15న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఐఐపీ, ధరల ఎఫెక్ట్ శుక్రవారం(12న) మార్కెట్లు ముగిశాక మార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), తయారీ రంగ గణాంకాలు వెలువడ్డాయి. ఇక ఏప్రిల్ నెలకు రిటైల్ ధర ద్రవ్యోల్బణ(సీపీఐ) వివరాలూ వెల్లడయ్యాయి. నేడు ఏప్రిల్ టోకుధరల ద్రవ్యోల్బణ తీరు వెల్లడికానుంది. ఈ ప్రభావం సైతం మార్కెట్లలో నేడు కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇవికాకుండా విదేశీ మార్కెట్లో నెలకొనే పరిస్థితులు ట్రెండ్‌ను ప్రభావితం చేయగలవని వివరించారు. ఏప్రిల్ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి, యూఎస్ రిటైల్ అమ్మకాల గణాంకాలు 16న వెలువడనున్నాయి. జపాన్ ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలను 19న ప్రకటించనుంది. ఇతర అంశాలు కూరగాయలు, వంటనూనెల ధరలు తగ్గడంతో సీపీఐ 18 నెలల కనిష్టానికి చేరినప్పటికీ ఐఐపీ ఐదు నెలల కనిష్టాన్ని తాకడం బలహీన అంశమని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. విద్యుత్, తయారీ రంగాలు ఇందుకు కారణమయ్యాయి. ఇవికాకుండా డాలరుతో రూపాయి మారకపు తీరు, బాండ్ల ఈల్డ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడి చమురు ధరలు తదితర అంశాలూ మార్కెట్ల కదలికలను నిర్దేశించగలవని వివరించారు. కర్ణాటక్ మ్యూజిక్ వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకంటే ముందుగా అత్యంత ఆసక్తిని రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష స్థాయికి చేరగా.. దశాబ్ద కాలం తదుపరి కాంగ్రెస్ పటిష్ట మెజారిటీని సాధించింది. ఇది కొంతమేర మార్కెట్లలో సెంటిమెంటును ప్రభావితం చేయగలదని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అభిప్రాయపడ్డారు. గత వారం జూమ్ గడిచిన వారం దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. సెన్సెక్స్ 974 పాయింట్లు జంప్‌చేసి 62,000 మార్క్‌ను మళ్లీ దాటింది. 62,027 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 246 పాయింట్లు ఎగసి 18,315 వద్ద ముగిసింది. మార్కెట్ల ప్రభావంతో చిన్న షేర్లకూ డిమాండ్ పెరిగింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.4 శాతం, స్మాల్ క్యాప్ 1.2 శాతం చొప్పున బలపడ్డాయి. -
14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!
ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత బలపడే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనుండటంతో కొంతమేర ఆటుపోట్లు కనిపించవచ్చని చెబుతున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా రికార్డుల ర్యాలీ బాలో సాగుతున్న మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగవచ్చని భావిస్తున్నారు. గత వారం(21-24) సైతం మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులను చవిచూశాయి. క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. సోమవారం(21న) కుప్పకూలిన మార్కెట్లు మిగిలిన మూడు రోజులూ బలపడ్డాయి. వెరసి సెన్సెక్స్ స్వల్పంగా 13 పాయింట్లు పుంజుకుని 46,974 వద్ద ముగిసింది. వారం చివర్లో మరోసారి 47,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. అయితే నిఫ్టీ స్వల్పంగా 11 పాయింట్లు క్షీణించి 13,749 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం 0.5 శాతం స్థాయిలో బలహీనపడటం గమనార్హం! (మార్కెట్లు భళా- ఈ మూడు కంపెనీలూ స్పీడ్) ప్రభావిత అంశాలు వచ్చే వారం మార్కెట్లను ప్రధానంగా కోవిడ్-19 సంబంధ వార్తలు ప్రభావితం చేసే వీలుంది. ఇటీవల సెకండ్‌వేవ్‌లో భాగంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కేసులు, ఇదేవిధంగా పలు కంపెనీల వ్యాక్సిన్లకు ఎమర్జెన్సీ అనుమతులు వంటి అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఇవికాకుండా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఇటీవల దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌పీఐలు నిరవధికంగా పెట్టుబడులకు దిగుతుండటంతో మార్కెట్లు దూకుడు చూపుతున్నట్లు పేర్కొన్నారు. సాంకేతికంగా ఇలా ఇటీవల కొద్ది రోజులుగా దేశీ మార్కెట్లలో కనిపిస్తున్న హుషారు వచ్చే వారంలోనూ కొనసాగవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. అయితే ఆటుపోట్లు తప్పకపోవచ్చని తెలియజేశారు. వచ్చే వారం ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీకి 13,800 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని అంచనా వేశారు. ఈ స్థాయి దాటితే 14,000 పాయింట్ల మార్క్‌కు చేరవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ మార్కెట్లు బలహీనపడితే.. నిఫ్టీకి తొలుత 13,400 పాయింట్ల వద్ద, తదుపరి 13,100 స్థాయిలోనూ మద్దతు(సపోర్ట్) లభించవచ్చని అభిప్రాయపడ్డారు. -
ఆర్బీఐ పాలసీ ఇక మార్కెట్లకు దిక్సూచి
ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగే వీలున్నట్లు స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షను చేపట్టడనుండంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించవచ్చని తెలియజేశారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన సమావేశాలు నిర్వహించనున్న మానిటరీ పాలసీ కమిటీ డిసెంబర్ 4న(శుక్రవారం) నిర్ణయాలు ప్రకటించనుంది. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకంటే మెరుగ్గా రికవర్కావడాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. క్యూ2లో జీడీపీ 7.5 శాతం క్షీణతను చవిచూసింది. కోవిడ్-19 కారణంగా లాక్‌డవున్‌ల అమలు, పలు వ్యవస్థలు స్థంభించడం తదితర ప్రతికూలతతో క్యూ1(ఏప్రిల్- జూన్)లో జీడీపీ 23.9 శాతం వెనకడుగు వేసిన విషయం విదితమే. ఇక అక్టోబర్‌లో మౌలిక పరిశ్రమలు 2.5 శాతం నీరసించాయి. వరుసగా 8వ నెలలోనూ వెనకడుగులో నిలిచాయి. వీటికితోడు రిటైల్(సీపీఐ), హోల్‌సేల్ ధరల(డబ్ల్యూపీఐ) గణాంకాలు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలలో ప్రధానంగా ప్రభావం చూపుతాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఆర్బీఐ లక్ష్యమైన 6 శాతానికి ఎగువన సీపీఐ, 2 శాతానికంటే అధికంగా డబ్ల్యూపీఐ నమోదవుతుండటం గమనించదగ్గ అంశమని తెలియజేశారు. ఇప్పటికే ఆర్బీఐ ఈ ఏడాది వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 1.15 శాతంమేర తగ్గించిన సంగతి తెలిసిందే. ఆటో అమ్మకాలు సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. నవంబర్ నెలకుగాను మంగళవారం(డిసెంబర్ 1న) వాహన విక్రయ గణాంకాలు వెల్లడికానున్నాయి. పండుగల సీజన్లో భాగంగా నవంబర్లోనూ అమ్మకాలు మెరుగ్గా నమోదుకావచ్చని ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్ఐఐల అండ ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నికరంగా ఈక్విటీలలో రూ. 65,317 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. గత రెండు దశాబ్దాలలోనే నవంబర్ పెట్టుబడుల్లో ఇది అత్యధికమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది దేశీయంగా ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అయితే ఇదే సమయంలో దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 48,319 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! సాంకేతికంగా.. శుక్రవారం(27)తో ముగిసిన వారంలో సెన్సెక్స్ 267 పాయింట్లు పుంజుకుని 44,150 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 110 పాయింట్లు బలపడి 12,969 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు మార్కెట్లను మించుతూ 2-4 శాతం చొప్పున జంప్‌చేశాయి. కాగా.. గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలక అవరోధమైన 13,040 పాయింట్ల దిగువనే నిలిచింది. ఈ స్థాయి దాటితే నిఫ్టీకి 13,150 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకాగలదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఈ స్థాయిని కోల్పోతే.. 12,750 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. -
క్యూ2 ఫలితాలపై ఇక మార్కెట్ల దృష్టి
వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా హెచ్చుతగ్గులను చవిచూసే వీలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. విప్రో లిమిటెడ్ 12న, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 14న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 16న క్యూ2(జులై- సెప్టెంబర్) ఫలితాలు విడుదల చేయనున్నాయి. ఈ కంపెనీలు ప్రకటించనున్న క్యూ3(అక్టోబర్- డిసెంబర్) ఆదాయ అంచనాలు(గైడెన్స్) సెంటిమెంటును ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇతర అంశాలూ దేశీ కంపెనీల క్యూ2 ఫలితాలతోపాటు.. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐల) పెట్టుబడులు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించే వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా భారీ సహాయక ప్యాకేజీకి సిద్ధమంటూ తెలియజేయడంతో వారాంతాన ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ జోరు తొలి సెషన్లో కొనసాగే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న అధ్యక్ష ఎన్నికల డిబేట్‌పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. కాగా.. వచ్చే వారం యూఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ నెలకు రిటైల్ అమ్మకాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల చేయనుంది. 40,000కు సెన్సెక్స్ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఆర్బీఐ లిక్విడిటీ చర్యలు ప్రకటించడం, యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలు వంటి అంశాలు గడిచిన వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో శుక్రవారం(9)తో ముగిసిన వారంలో సెన్సెక్స్ 1,812 పాయింట్లు లాభపడింది. 40,509 వద్ద ముగిసింది. తద్వారా 40,000 పాయింట్ల కీలక మార్క్ ఎగువన స్థిరపడింది. నిఫ్టీ సైతం 497 పాయింట్లు జమ చేసుకుని 11,914 వద్ద నిలిచింది. వెరసి మార్కెట్లు 7 నెలల గరిష్టం వద్ద ముగిశాయి. ఐటీ, ఫైనాన్స్ దిగ్గజాలు విప్రో 19 శాతం, టీసీఎస్ 12 శాతం, ఇన్ఫోసిస్ 9 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 11 శాతం, హెచ్డీఎఫ్సీ 9 శాతం చొప్పున ఎగశాయి. -
వచ్చే వారం మార్కెట్లలో భారీ ఆటుపోట్లు!
వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా భారీ హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని మార్కెట్ విశ్లేషకులు ఊహిస్తున్నారు. ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపగల అమెరికన్ కేంద్ర బ్యాంకు.. ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. మంగళవారం ప్రారంభంకానున్న పరపతి సమావేశాలు బుధవారం(29న) ముగియనున్నాయి. మరోవైపు జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్ గడువు గురువారం(30న) ముగియనుంది. దేశీయంగా నేడు(25న) ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనుంది. ఈ అంశాల నేపథ్యంలో వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య సంచరించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఫెడ్‌పై కన్ను ఇప్పటికే ప్రపంచ దేశాలన్నిటా పాకిన కోవిడ్-19.. కొద్ది రోజులుగా అమెరికాలోని పలు రాష్ట్రాలలో మరింత వేగంగా విస్తరిస్తోంది. 50 రాష్ట్రాలలో 42 రాష్ట్రాలు కరోనా వైరస్‌తో వణుకుతున్నాయి. దీంతో వాషింగ్టన్ ప్రభుత్వం మరో భారీ ప్యాకేజీని ప్రకటించవచ్చన్న అంచనాలు ఇటీవల పెరిగాయి. జులైలో నిరుద్యోగిత పెరగడంతో ప్రజలకు ప్రత్యక్షంగా నగదు చెల్లించే పథకాన్ని సెనేట్ రిపబ్లికన్స్ ప్రతిపాదించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా, చైనా మధ్య తాజాగా వివాదాలు చెలరేగిన విషయం విదితమే. దీంతో దేశ ఆర్థిక వృద్ధిపై ఫెడ్ అంచనాలు స్టాక్, ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగలవని నిపుణులు చెబుతున్నారు. రోలోవర్స్ జులై ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనున్న కారణంగా ట్రేడర్లు ఆగస్ట్ సిరీస్‌కు పొజిషన్లను రోలోవర్ చేసుకునే అవకాశముంది. దీనికితోడు పలు దిగ్గజాలు వచ్చే వారం క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలు విడుదల చేయనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాల ప్రభావం షేరుపై సోమవారం(27న) ప్రతిఫలించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ బాటలో బ్లూచిప్ కంపెనీలు టెక్ మహీంద్రా, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఇన్ఫ్రాటెల్ 27న ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇదే విధంగా అల్ట్రాటెక్ సిమెంట్ 28న, భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జీఎస్కే ఫార్మా, మారుతీ సుజుకీ 29న క్యూ1 పనితీరు వెల్లడించనున్నాయి. ఇతర దిగ్గజాలలో ఆర్ఐఎల్, హెచ్‌ఢీఎఫ్‌సీ 30న, ఐవోసీ 31న ఫలితాలు తెలియజేయనున్నాయి. ఇదే రోజు జూన్ నెలకు మౌలిక సదుపాయాల గణాంకాలు వెల్లడికానున్నాయి. ఇతర అంశాలూ ఫెడ్ పాలసీ, ఎఫ్‌అండ్‌వో గడువు ముగియడం, బ్లూచిప్స్ ఫలితాలకుతోడు.. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు తదితర పలు అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంటును ప్రభావితం చేయగలవని నిపుణులు వివరించారు. ఇటీవల కోవిడ్-19 కట్టడికి రూపొందుతున్న పలు కంపెనీల వ్యాక్సిన్ల పురోగతి వార్తలు సైతం మార్కెట్లను నడిపిస్తున్నట్లు తెలియజేశారు. -
వివో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్...
బీజింగ్: వివో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించింది. జెడ్సిరీస్లో జెడ్ 1 పేరుతో తొలి డివైస్‌ను లాంచ్ చేసింది. ప్రధానంగా కరెంట్ మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా బిగ్ స్క్రీన్, ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ సహా అద్బుత ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అందుబాటులోకి తెచ్చింది. సుమారు రూ.19200లుగా దీని ధర ఉండనుంది. అయితే భారత్ సహా ఇతర మార్కెట్లలో ఎపుడు విక్రయానికి రానుంది స్పష్టత లేదు. బ్లాక్, రెడ్, బ్లూ అనే మూడు కలర్ ఈ డివైస్ వేరియంట్లలో లభిస్తుంది. జెడ్ 1 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6.26 అంగుళాల భారీ స్క్రీన్ 1080x2280 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 660ఎస్ఓసీ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 256 దాకా విస్తరించుకునే అవకాశం 13 +2 మెగాపిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 12ఎంపీ సెల్ఫీ కెమెరా 3260 ఎంఏహెచ్ బ్యాటరీ -
రుతుపవనాలు, బ్లూచిప్ కంపెనీల ఫలితాలే కీలకం
న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లాంటి బ్లూచిప్ కంపెనీల రాబడులు, రుతుపవనాల పురోగతి ఈ వారం స్టాక్ మార్కెట్లకు కీలక అంశాలుగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపుతూ మార్కెట్లను ఒడిదుడుకులకు లోను చేసే అవకాశాలున్నట్టు పేర్కొంటున్నారు. రుతుపవనాల పురోగతి వివరాలు, ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్స్, స్థూల ఆర్థిక డేటా, 2016 ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసిక ఫలితాలు ఈ వారం దేశీయ సూచీలను నిర్దేశిస్తాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్ లైన్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ విజయ్ సింగానియా తెలిపారు. బీపీసీఎల్, టాటా పవర్, సిప్లా, టెక్ మహింద్రా, బజాజ్ ఆటో, గెయిల్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్, ఎస్ బీఐ, కోల్ ఇండియాలు ఈ వారంలో మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆశించిన ఫలితాలను విడుదలచేయలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగానికి అతిపెద్ద బ్యాంకుగా ఉన్న ఎస్ బీఐ ఫలితాలపై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టిసారించనున్నారని రిలయన్స్ సెక్యురిటీస్ తెలిపింది. కొన్ని వారాల వరకూ మార్కెట్లకి, ఆర్థిక వ్యవస్థకు రుతుపవనాలే కీలక అంశంగా ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గతవారం రెండు దేశీయ సూచీలు సెన్సెక్స్, నిప్టీలు నష్టాలు పాలయ్యాయి. సెన్సెక్స్ 187.67 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 65.20 పాయింట్లు నష్టపోయింది. -
మార్కెట్ ట్రెండ్ కి గణాంకాలు,ఫలితాలే కీలకం
న్యూఢిల్లీ: బ్లూ చిప్ కంపెనీ లుపిన్, ఐటీసీ త్రైమాసిక ఫలితాలు, టోకు ధరల ద్రవ్యోల్బణ డేటా, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ వారం మార్కెట్లకు కీలక అంశాలుగా మారనున్నాయని పై విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రుతుపవనాల సెంటిమెంట్లు మార్కెట్లకు పాజిటివ్ ట్రెండ్ చూపిస్తున్నా... వారంలో విడుదలయ్యే గణాంకాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నట్టు తెలుస్తోంది. 2016 ఏప్రిల్ నెలకు సంబంధించిన టోకుధరల ఇండెక్స్ సోమవారం విడుదల కానుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్ లైన్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ విజయ్ సింగానియా తెలిపారు. మరోవైపు అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయొచ్చని ఆయన చెప్పారు. అదేవిధంగా లుపిన్, ఐటీసీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు నాలుగో త్రైమాసిక ఫలితాలు ఈ వారంలోనే విడుదల కానున్నాయి. ఓ వైపు త్రైమాసిక ఫలితాలు, టోకు ధరల ఇండెక్స్ ఫలితాలు, మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ ఈ వారం కూడా స్థిరంగా ఉండదని, ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశముందని మోతిలాల్ ఓస్వల్ సెక్యురిటీస్ విశ్లేషకుడు రవి శెనోయ్ తెలిపారు. త్రైమాసిక ఫలితాలు, రుతుపవనాల సంకేతాలు, అంతర్జాతీయ అంశాలు మార్కెట్ సెంటిమెంట్ ను ఖరారు చేస్తాయని కొటక్ సెక్యురిటీస్ ప్రైవేట్ క్లెయింట్ గ్రూప్ రీసెర్చర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెండ్ దిపెన్ షా పేర్కొన్నారు. నత్తనడకన సాగిన పారిశ్రామిక ఉత్పత్తి డేటా, ఏప్రిల్ నెల వినియోగదారుల ద్రవ్యోల్బణం పెరగడం గతవారం మార్కెట్ ను కొంత ప్రభావితం చేశాయి. ఆఖరికి 261 పాయింట్లు పెరిగి, 25,489.57 వద్ద సెన్సెక్స్ ముగిసింది. -
గణాంకాలే కీలకం..
న్యూఢిల్లీ: రెండు రోజుల సెలవుల కారణంగా మూడు రోజులే ట్రేడింగ్ ఉండే ఈ వారంలో గణాంకాలు కీలకమని నిపుణులంటున్నారు. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ముడి చమురు ధరలు, రూపాయి కదలికలు కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న(గురువారం), శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 15న(శుక్రవారం) మార్కెట్‌కు సెలవులు. ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితమైనందున ఒడిదుడుకులుండవచ్చని, వ్యవస్థాగత ఇన్వెస్టర్లు పరిమితంగానే ట్రేడింగ్‌లో పాల్గొనడం దీనికి ప్రధాన కారణమని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. పరిమితంగా ట్రేడింగ్: ఈ నెల 12(మంగళవారం)న వెల్లడయ్యే ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి, మార్చి నెల వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను నడిపిస్తాయని సింఘానియా వివరించారు. కంపెనీలు వెల్లడించే గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలే.. సమీప కాలంలో స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపే కీలక అంశమని తెలిపారు. శుక్రవారం వెల్లడయ్యే ఇన్ఫోసిస్ ఫలితాలతో క్యూ4 ఫలితాల సీజన్ ఆరంభం కానున్నది. రెండు రోజుల సెలవుల కారణంగా ఇన్వెస్టర్లు, ట్రేడర్లు పరిమితంగా ట్రేడింగ్ జరుపుతారని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్(రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం టోకు ధరల సూచీ గణాంకాలను ప్రభుత్వం ఈ నెల 14న విడుదల చేయాల్సి ఉంది. కానీ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ రోజు సెలవు కారణంగా ఈ గణాంకాలను ఈ నెల 18న (వచ్చే సోమవారం) వెల్లడిస్తారు. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే, చైనా ట్రేడ్ బ్యాలెన్స్ గణాంకాలు ఈ నెల 12న, అమెరికా ముడి చమురు నిల్వల గణాంకాలు ఈ నెల 13న(బుధవారం), చైనా జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 14న(గురువారం)వెలువడతాయి. రెండో నెలలోనూ బుల్లిష్‌గానే... భారత స్టాక్ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా రెండో నెలలోనూ బుల్లిష్‌గానే ఉన్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,600 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఆర్బీఐ రేట్ల కోత అంచనాలతో గత నెలలో రూ.19,967 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయి. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.7,964 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.3,202 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. మొత్తం వీరి నికర పెట్టుబడులు రూ.4,762 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈ నెల పెట్టుబడుల విషయానికి వస్తే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈక్విటీల్లో రూ.3,469 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.4,152 కోట్లు చొప్పున మొత్తం రూ.7,625 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఆర్బీఐ రేట్ల కోత కారణంగా బాండ్ ధరలు ర్యాలీ జరిపాయని, ఫలితంగా ఎఫ్‌పీఐల నుంచి మరిన్ని నిధులు వచ్చాయని ఎస్ఏఎస్ ఆన్లైన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) సిద్ధాంత్ జైన్ చెప్పారు. -
బ్లూచిప్స్ ఫలితాలపై దృష్టి..
న్యూఢిల్లీ: పలు బ్లూచిప్ కంపెనీలు ప్రకటించే రెండో త్రైమాసికం(క్యూ2) ఆర్థిక పలితాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క, దసరా పండుగ నేపథ్యంలో గురువారం మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. గత వారం వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు కూడా సోమవారం మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంచనాలను మించి రిలయన్స్ క్యూ2లో రికార్డు లాభాన్ని(రూ.6,720 కోట్లు) ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ వారం ఫలితాలను వెల్లడించనున్న ప్రధాన కంపెనీల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడియా సెల్యులార్, హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, హీరోమోటో కార్ప్, బజాజ్ ఆటో, విప్రో, కెయిర్న్ ఇండియా వంటివి ఉన్నాయి. మరోపక్క, బిహార్‌లో జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ సరళిని కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారని, దీంతో పాటు గ్లోబల్ మార్కెట్ల కదలికలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నట్లు ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధర హెచ్చుతగ్గులు, కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు సమీప కాలంలో మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. ఇక విదేశీ పరిణామాల విషయానికొస్తే.. నేడు(సోమవారం) చైనా ఈ ఏడాది మూడో త్రైమాసికం జీడీపీ గణాంకాలను వెల్లడించనుంది. గత వారం మార్కెట్... ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వాయిదా వేయొచ్చనే అంచనాలు బలపడుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో వారంలోనూ లాభాలను కొనసాగించింది. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 135 పాయింట్లు లాభపడి 27,214 వద్ద స్థిరపడింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 48 పాయింట్ల లాభంతో 8,238 వద్ద ముగిసింది. మళ్లీ విదేశీ ఇన్వెస్టర్ల జోరు... విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మళ్లీ దేశీ మార్కెట్లో పెట్టుబడుల జోరును పెంచుతున్నారు. గత రెండు నెలల్లో భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు అక్టోబర్‌లో దాదాపు రూ.17,000 కోట్ల నిధులను నికరంగా వెచ్చించారు. ఈ నెల ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్లో నికరంగా రూ.3,295 కోట్లు, డెట్(బాండ్స్) మార్కెట్లో రూ.13,695 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా ఆర్బీఐ రేట్ల కోత, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం, ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వాయిదా అంచనాలు దీనికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. విదేశీ మార్కెట్ల భారీ పతనం కారణంగా ఆగస్ట్‌లో రూ.17,524 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.5,784 కోట్లను దేశీ మార్టెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. -
సెన్సెక్స్ తొలి మద్దతు 26,280
మార్కెట్ పంచాంగం అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు ఉద్దీపన ప్యాకేజీని నిలిపివేయనున్నట్లు 2013 ప్రథమార్థంలో సంకేతాలు ఇచ్చినపుడు ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా భారత్‌లో సూచీలు దాదాపు 15 శాతం తగ్గాయి. ఇప్పుడు కూడా అంతేశాతం సెన్సెక్స్, నిఫ్టీలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ జరిగింది సాధారణమైన పతనంగానే భావించాలి. కానీ గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు 1997 తర్వాత అత్యధికస్థాయిలో రూ. 17 వేల కోట్లు భారత్ మార్కెట్లో నికర అమ్మకాలు జరిపారు. అలాగే ఈ నెల రెండు వారాల్లో కూడా 7,000 కోట్లు విక్రయించారు. మార్కెట్ క్షీణత సాధారణంగానే వున్నా, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు అసాధారణంగా వుండటం ఆందోళనకరం. ఈ సెప్టెంబర్ 17నాటి ఫెడ్ నిర్ణయంకంటే, విదేశీ ఇన్వెస్టర్లు వ్యవహరించే తీరే మన మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తుందన్న అంచనాలకు రావొచ్చు. సెన్సెక్స్ సాంకేతికాంశాలు సెప్టెంబర్ 11తో ముగిసిన వారంలో 24,833 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్, అటుతర్వాత కోలుకొని, చివరకు 1.6 శాతం లాభపడి 25,610 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ పంచాంగంలో దీర్ఘకాలిక మద్దతుగా ప్రస్తావిస్తున్న 25,300 పాయింట్ల స్థాయి దిగువకు పతనమైనా, తిరిగి వేగంగా ఈ స్థాయి పైకి వచ్చి స్థిరపడటం సానుకూలాంశం. ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశం సందర్భంగా సెన్సెక్స్ హెచ్చుతగ్గులకు లోనైతే తొలుత 25,280 స్థాయికి తగ్గే అవకాశం ఉంటుంది. ఆ లోపున వేగంగా 24,745 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,420-24,160 పాయింట్ల శ్రేణి వద్దకు పతనం కావచ్చు. గతవారపు రికవరీ కొనసాగితే సెన్సెక్స్ తొలుత 25,880 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 26.202 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపైన 26,586-26,816 పాయింట్ల శ్రేణి వరకూ ర్యాలీ జరిపే అవకాశం ఉంటుంది. నిఫ్టీ తొలి మద్దతు 7,680-నిరోధం 7,870 క్రితం వారం ప్రధమార్థంలో 7,539 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో కోలుకొని 7,865 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ పెరిగింది. చివరకు 134 పాయింట్ల లాభంతో 7,789 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం నిఫ్టీ ఎట్టకేలకు 2014 మే 16 నాటి గరిష్ట స్థాయి అయిన 7,563 స్థాయిని పరీక్షించింది. రానున్న రోజుల్లో ఈ 7,500-7,600 మద్దతు శ్రేణి నిఫ్టీకి ప్రధానమైనది. ఈ వారం నిఫ్టీ గనుక పెరిగితే తిరిగి 7,870 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన స్థిరపడితే 7,952 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే 8,080-8,142 పాయింట్ల శ్రేణి వరకూ పెరిగే అవకాశం వుంది. ఈ వారం క్షీణిస్తే 7,680 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఆ లోపున 7,500-7,600 పాయింట్ల మద్దతు శ్రేణికి పతనం కావొచ్చు. ఈ శ్రేణిని కోల్పోతే 7,200-7,118 పాయింట్ల మద్దతు శ్రేణికి నిలువునా పడిపోయే ప్రమాదం వుంటుంది. -
గ్రీసు, రుతుపవనాల ఆధారంగా ట్రెండ్
న్యూఢిల్లీ : దేశంలో రుతుపవనాల గమనం, అంతర్జాతీయంగా గ్రీసు దేశపు రుణ సంక్షోభ సమస్యల ఆధారంగా ఈ వారం మార్కెట్ ట్రెండ్ వుంటుందని విశ్లేషకులు అంచనావేశారు. దేశీయంగా కీలకమైన అంశమేదీ లేనందున, రుతుపవనాల గమనం మార్కెట్లో స్వల్పకాలిక ట్రెండ్‌ను నిర్దేశిస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అన్నారు. ఇప్పటివరకూ దేశంలో వర్షాలు సగటుకంటే అధికంగానే కురిశాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో గతవారం దేశీయ మార్కెట్ పుంజుకుంది. జూలై, ఆగస్టు నెలల్లో రైతులు పంటలు వేయనున్నందున, ఇకముందు రుతుపవనాల కదలికలు ప్రధానమని ఆయన చెప్పారు. ఇక అంతర్జాతీయపరంగా గ్రీసు రుణ సంక్షోభ పరిష్కారానికి జరుగుతున్న ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను ప్రభావితం చేస్తుందని ఆయన చెప్పారు. ఈ నెలాఖరుకల్లా గ్రీసు ఐఎంఎఫ్‌కు ఇవ్వాల్సిన మొత్తం చెల్లించకపోతే, ఆ దేశం దివాలా తీసినట్లవుతుంది. దాంతో స్టాక్, బాండ్ మార్కెట్లు అతలాకుతలమవుతాయని అంచనా. అయితే గ్రీసుకు అవసరమైన నిధులిచ్చే అంశమై యూరోపియన్ యూనియన్ ఈ సోమవారం జరపనున్న సమావేశం కీలకం కానుందని అగర్వాల్ వివరించారు. జూన్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ గురువారం ముగియనున్న నేపథ్యంలో మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని మరోవైపు నిపుణులు హెచ్చరించారు. గతవారం మార్కెట్.. గతవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వంలో ర్యాలీ జరిగిన ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు 3-3.5 శాతం మధ్య పెరిగాయి. సెన్సెక్స్ 891 పాయింట్లు లాభపడి 27,316 పాయింట్ల వద్దకు చేరింది. నిఫ్టీ 242 పాయింట్ల లాభంతో 8,225 పాయింట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 12 శాతం పెరగ్గా, ఓఎన్జీసీ, మహీంద్రా, హిందుస్థాన్ యూనీలీవర్‌లు 5 శాతంపైగా ఎగిసాయి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.
-
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 490 పాయింట్లు కోల్పోయి 28227 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 134 పాయింట్ల నష్టపోయి 8526 వద్ద ముగిసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించవచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు!
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపుతాయ్... * జీడీపీ, ఐఐపీ డేటా కూడా... * ఎస్బీఐ, ఓఎన్జీసీ, కోల్ ఇండియాల ఫలితాలపై దృష్టి * ఈ వారం మార్కెట్ ట్రెండ్‌పై నిపుణుల అంచనా... న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ (ఏఏపీ) విజయం సాధించవచ్చంటూ వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌కు అనుగుణంగా ఈ సోమవారం స్టాక్ మార్కెట్లు స్పందిస్తాయని, అటుతర్వాత మంగళవారం ప్రకటితమయ్యే వాస్తవ ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా మార్కెట్లు కదలవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. ఢిల్లీ ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశం వున్నందున, స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయని వారంటున్నారు. ఈ వారం వెలువడే జీడీపీ, పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ)గణాంకాలు, కొన్ని బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ట్రెండ్‌ను నిర్దేశించే పలు అంశాల కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రంగా వుంటాయని ట్రేడ్‌స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపకుడు విజయ్ సింఘానియా అన్నారు. సోమవారం జీడీపీ అడ్వాన్సు అంచనాల్ని ప్రభుత్వం విడుదల చేస్తుందని, 2014 డిసెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి, గత జనవరి నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వచ్చే గురువారం ప్రకటితమవుతాయని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ చెప్పారు. ఇవి ఈ వారం ద్వితీయార్థంలో ట్రెండ్‌ను ప్రభావితం చేస్తాయన్నారు. బ్లూచిప్ కంపెనీలైన లార్సన్ అండ్ టూబ్రో, డీఎల్ ఎఫ్, బీహెచ్ఈఎల్, సిప్లా, కోల్ ఇండియా, హిందాల్కో, ఓఎన్జీసీ, మహీంద్రా, ఎస్బీఐలు క్యూ3 ఆర్థిక ఫలితాల్ని ఈ వారం వెల్లడించనున్నాయి. ఎస్బీఐ, ఓఎన్జీసీ, కోల్ ఇండియాల ఫలితాలు, ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటాల ఆధారంగా స్టాక్ సూచీలు కదలవచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అభిప్రాయపడ్డారు. ఇక అంతర్జాతీయ పరిణామాలకొస్తే... గ్రీసు రుణ ప్రతిపాదనలను చర్చించేందుకు యూరో దేశాల ఆర్థిక మంత్రులు బుధవారం సమావేశం కానున్నారు. యూరో ప్రాంతపు జీడీపీ గణాంకాలు శుక్రవారం విడుదలకానున్నాయి. ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 12,000 కోట్లు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఫిబ్రవరి నెల తొలివారంలో భారత క్యాపిటల్ మార్కెట్లో రూ. 12,000 కోట్ల నికర పెట్టుబడులు జరిపారు. వీటిలో ఫిబ్రవరి2-6వ తేదీల మధ్య షేర్లలోకి రూ. 4,702 కోట్లు ప్రవహించగా, రూ. 7,059 కోట్లు రుణపత్రాల్లోకి తరలివ చ్చాయి. తాజా నిధులతో ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు దేశంలో మొత్తం రూ. 45,000 కోట్లు నికరంగా పెట్టుబడి చేసినట్లయ్యింది. ఈక్విటీ స్కీముల్లోకి రూ. 5,850 కోట్లు: ఈ ఏడాది జనవరిలో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌కు చెందిన ఈక్విటీ పథకాల్లో రూ. 5,850 కోట్లు పెట్టుబడి చేశారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో ఈక్విటీ స్కీములు సమీకరించిన నిధుల మొత్తం రూ. 56,000 కోట్లకు చేరినట్లు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్లో అధిక రాబడులు, సెంటిమెంట్ మెరుగుపడటంతో ఈక్విటీ స్కీములు అధిక పెట్టుబడుల్ని ఆకర్షించగలుగుతున్నాయని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. తాజా నిధుల ప్రవాహంతో ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 12 లక్షల కోట్లకు పెరిగింది.