
సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వి11 ప్రొ ను నేడు (సెప్టెంబర్ 6, గురువారం) విడుదల చేసింది. దీని ధరను రూ.25,990గా నిర్ణయించింది. ఆకట్టుకునే ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు సెప్టెంబర్ 12కి విక్రయానికి లభ్యం.
ఇంక లాంచింగ్ ఆఫర్ విషయానికి వస్తే హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై రెండువేల రూపాయల దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. పే టీఎం మాల్ ద్వారా నో కాస్ట్‌ఈఎంఐతోపాటు అదనంగా రెండువ వేల రూపాయల క్యాష్‌బ్యాక్. మొదటి ఆరునెలల్లో వన్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్. వీటితోపాటు రిలయన్స్ జియో ద్వారా రూ.4050 ఆఫర్ కూడా ఉంది.
వివో వి11 ప్రొ ఫీచర్లు
6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
2340x1080రిజల్యూషన్
6 జీబీ ర్యామ్, 64జీబీ
12 +5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
3400 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment