
ఒప్పో తొలి ఫ్లిప్‍ఫోన్ ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. గత ఏడాది చైనా మార్కెట్‍లో అడుగుపెట్టిన ఈ మడత ఫోన్‌ను ఈనెల 15వ తేదీన లాంచ్ చేయనున్నట్టు ఒప్పో అధికారికంగా ప్రకటించింది. అయితే ఫ్లిప్ కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటుండగా ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి
ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌లో 3.26 అంగుళాల అమోలెడ్ సెండరీ డిస్‍ప్లే, 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉండే 6.8 అంగుళాల అమోలెడ్ ప్రైమరీ అమోలెడ్ డిస్‍ప్లేతో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వస్తోంది. 5జీ ఫ్లాగ్‍షిప్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమన్సిటీ 9000+ను కలిగి ఉంటుంది.
ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఒప్పో ఇస్తోంది. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే చైనాలో 5,999 యువాన్లు (సుమారు రూ.71,200)గా ఉంది. భారత్‌లో సుమారు ఇదే ధరతో విడుదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మడత ఫోన్ పర్పుల్, బ్లాక్, గోల్డ్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment