వివో స్మార్ట్‌ఫోన్లపై బంపర్‌ ఆఫర్లు | Vivo Carnival Sale Kicks Off | Sakshi
Sakshi News home page

వివో స్మార్ట్‌ఫోన్లపై బంపర్‌ ఆఫర్లు

Published Mon, Oct 15 2018 1:06 PM | Last Updated on Mon, Oct 15 2018 8:19 PM

Vivo Carnival Sale Kicks Off - Sakshi

ఈ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ఫెస్టివల్‌ సేల్స్‌తో అదరగొట్టిన వెంటనే, స్మార్ట్‌ఫోన్ల కంపెనీ వివో కూడా కార్నివల్‌ సేల్‌కు తెరలేపింది. తన ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఈ సేల్‌ను నిర్వహించనున్నట్టు పేర్కొంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్‌, అక్టోబర్‌ 18 వరకు కొనసాగుతోంది. నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లు, బైబ్యాక్‌ ఆఫర్లు, హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు, ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై వన్‌-టైమ్‌ స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ డీల్‌, ధర తగ్గింపు వంటి ఆఫర్లను అందిస్తోంది. వివో వీ9 ప్రొ, వివో వీ11 ప్రొ, వివో వీ9 యూత్‌, వివో వై66, వివో వై83, వివో ఎక్స్‌21 స్మార్ట్‌ఫోన్లపై ధర తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది ఆ కంపెనీ. 

వివో కార్నివల్‌ ఆఫర్లు ఈ విధంగా ఉన్నాయి....
వివో కొత్తగా లాంచ్‌ చేసిన వివో వీ9 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.19,990 నుంచి రూ.17,990కు తగ్గించింది. అంతేకాక రూ.8,995 క్యాష్‌బ్యాక్‌ను, నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ను అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇస్తోంది. జియో కూడా పనిలో పనిగా రూ.4,050 విలువైన ప్రయోజనాలను ఆఫర్‌ చేస్తోంది. 

వివో వీ11 ప్రొ 6జీబీ ర్యామ్‌ వేరియంట్‌ కార్నివల్‌ సేల్‌లో రూ.25,990కు లిస్ట్‌ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై ఉచితంగా బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్లు, వన్‌ టైమ్‌ స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌, వొడాఫోన్‌ యూజర్లకు 250జీబీ వరకు డేటా, జియో యూజర్లకు రూ.4050 విలువైన ప్రయోజనాలు, నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లు, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఉన్నాయి.  వివో వీ11 6జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ప్రస్తుతం రూ.20,990గా లిస్ట్‌ అయింది. పైన పేర్కొన్న ప్రయోజనాలే ఈ ఫోన్‌పై కూడా అందుతున్నాయి. వివో వీ5 ధర రూ.18,990 నుంచి రూ.15,990కు తగ్గింది. వివో వీ9 యూత్‌ కూడా డిస్కౌంట్‌లో రూ.13,990కు లభ్యమవుతోంది. వివో వై66పై భారీగా ధర తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.14,990 నుంచి రూ.7,990కు పడిపోయింది. ఇలా వివో స్మార్ట్‌ఫోన్లపై ఆ కంపెనీ ధర తగ్గింపుతో పాటు పలు ప్రయోజనాలను అందిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement