Festival Sale
-
అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ వచ్చేస్తోంది..ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?
Amazon Great Freedom Festival sale 2023 ఆన్లైన్ దిగ్గజం మరోసారి ఫెస్టివల్ సేల్‌ను షురూచేసింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ఆగస్ట్ 5వ తేదీన ప్రారంభం కానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో, అమెజాన్ ఇండియా అద్భుతమైన సేల్ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. వివిధ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, హోం అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, తదితర పలు విభాగాల్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభించనున్నాయి. దీనికి తోడు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే కొనుగోళ్లపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ప్రతీ ఆగస్ట్ నెలలో గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ప్రకటించే అమెజాన్ ఈ ఏడాది గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ తేదీలను శుక్రవారం ప్రకటించింది. ఈ సేల్ ఆగస్ట్ 5 నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. ప్రైమ్ మెంబర్స్ కు ఒక రోజు ముందే ఈ సేల్ ప్రారంభమవుతుంది అనేది తెలిసిన సంగతే. కొనుగోళ్లపై స్పెషల్ ఫ్లాట్ డిస్కౌంట్‌తోపాటు, బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్, వీటన్నింటికి తోడు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందుబాటులోఉంటాయి. ముఖ్యంగా ఈ సేల్ లో శాంసంగ్ వన్ ప్లస్, రియల్ మి, ఎంఐ తదితర కంపెనీల స్మార్ట్ ఫోన్స్ పై 40 శాతానికి మించి డిస్కౌంట్ లభించనుంది. (పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా పైపైకే) వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి గృహోపకరణాలు కూడా ఆకర్షణీయమైన తగ్గింపు ధరల లభ్యం. సోనీ ప్లేస్టేషన్ 5 ఇతర గేమింగ్ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు. గేమ్‌లు కూడా గరిష్టంగా 80 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి. ల్యాప్‌టాప్‌లు , వైర్లెస్ ఇయర్‌బడ్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. టీజర్ పేజీ ల్యాప్‌టాప్‌లు, ఇయర్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు మరియు అనేక ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా యాపిల్, తదితర కంపెనీల టాబ్లెట్లు గరిష్టంగా 50 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి. -
రిలయన్స్ డిజిటల్లో ఎలక్ట్రానిక్స్‌పై భారీ ఆఫర్లు
హైదరాబాద్: ఈ పండగ సీజన్‌ను మరింత వేడుకగా జరుపుకునేందుకు రిలయన్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ పేరుతో ప్రత్యేక సేల్ తీసుకువచ్చింది. ఈ సేల్‌లో భాగంగా మీకు నచ్చిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుకోవచ్చు. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్‌తో పాటు రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లో ఈ సేల్ అక్టోబర్ 3 నుంచి మొదలవుతుంది. అన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్స్ పై కొనుగోలుదారులు 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ ₹2,000/ వరకు పొందవచ్చు. స్టోర్స్‌లో అక్టోబర్ 3 నుంచి 12 వరకు జరిపే కొనుగోళ్లపై, రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లో అక్టోబర్ 3 నుంచి 10 వరకు జరిపే కొనుగోళ్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. పేటీఎం ద్వారా ₹4,999/- కనీస చెల్లింపు చేస్తే ₹1,000/- వరకు క్యాష్‌బ్యాక్‌ను కొనుగోలుదారులు పొందవచ్చు. ఇవేకాదు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్లు, హోమ్ అప్లయన్సెస్‌పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. అన్ని ఆఫర్లు, ధరలకు నియమనిబంధనలు వర్తిస్తాయి. టీవీల్లో సాంసంగ్ నియో క్యూలెడ్ కొనుగోలుపై 3 సంవత్సరాల వారెంటీతో పాటు 20% వరకు క్యాష్‌బ్యాక్, రూ.37,400 విలువైన సాంసంగ్ సౌండ్ బార్ పూర్తి ఉచితంగా పొందవచ్చు. ఎల్జీ ఓలెడ్ రేంజ్ స్మార్ట్ టీవీలపై 3 సంవత్సరాల వారెంటీతో పాటు 20% క్యాష్‌బ్యాక్ కూడా ఉంది.(చదవండి: అమెజాన్‌లో మొబైల్స్‌పై అదిరిపోయే ఆఫర్స్) -
వివో స్మార్ట్ఫోన్లపై బంపర్ ఆఫర్లు
ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఫెస్టివల్ సేల్స్‌తో అదరగొట్టిన వెంటనే, స్మార్ట్ఫోన్ల కంపెనీ వివో కూడా కార్నివల్ సేల్కు తెరలేపింది. తన ఆన్లైన్ స్టోర్‌లో ఈ సేల్‌ను నిర్వహించనున్నట్టు పేర్కొంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్, అక్టోబర్ 18 వరకు కొనసాగుతోంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, బైబ్యాక్ ఆఫర్లు, హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు, ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ డీల్, ధర తగ్గింపు వంటి ఆఫర్లను అందిస్తోంది. వివో వీ9 ప్రొ, వివో వీ11 ప్రొ, వివో వీ9 యూత్, వివో వై66, వివో వై83, వివో ఎక్స్21 స్మార్ట్ఫోన్లపై ధర తగ్గింపును ఆఫర్ చేస్తోంది ఆ కంపెనీ. వివో కార్నివల్ ఆఫర్లు ఈ విధంగా ఉన్నాయి.... వివో కొత్తగా లాంచ్ చేసిన వివో వీ9 ప్రొ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.19,990 నుంచి రూ.17,990కు తగ్గించింది. అంతేకాక రూ.8,995 క్యాష్‌బ్యాక్‌ను, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. జియో కూడా పనిలో పనిగా రూ.4,050 విలువైన ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. వివో వీ11 ప్రొ 6జీబీ ర్యామ్ వేరియంట్ కార్నివల్ సేల్‌లో రూ.25,990కు లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఉచితంగా బ్లూటూత్ ఇయర్ఫోన్లు, వన్ టైమ్ స్క్రీన్ రిప్లేస్మెంట్, వొడాఫోన్ యూజర్లకు 250జీబీ వరకు డేటా, జియో యూజర్లకు రూ.4050 విలువైన ప్రయోజనాలు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, హెచ్డీఎఫ్సీ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉన్నాయి. వివో వీ11 6జీబీ ర్యామ్ వేరియంట్ ప్రస్తుతం రూ.20,990గా లిస్ట్ అయింది. పైన పేర్కొన్న ప్రయోజనాలే ఈ ఫోన్‌పై కూడా అందుతున్నాయి. వివో వీ5 ధర రూ.18,990 నుంచి రూ.15,990కు తగ్గింది. వివో వీ9 యూత్ కూడా డిస్కౌంట్లో రూ.13,990కు లభ్యమవుతోంది. వివో వై66పై భారీగా ధర తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.14,990 నుంచి రూ.7,990కు పడిపోయింది. ఇలా వివో స్మార్ట్ఫోన్లపై ఆ కంపెనీ ధర తగ్గింపుతో పాటు పలు ప్రయోజనాలను అందిస్తోంది. -
రెండున్నర రోజుల్లో 25 లక్షల డివైజ్‌లు అమ్మకం
చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమి రికార్డులు బ్రేక్ చేసింది. కేవలం రెండున్నర రోజుల్లో 25 లక్షలకు పైగా ఎంఐ డివైజ్‌లను విక్రయించింది. ఈ డివైజ్‌ల్లో ఎంఐ ఎల్ఈడీ టీవీలు, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ పవర్ బ్యాంక్‌లు, ఎంఐ ఇయర్ఫోన్లు, ఎంఐ రూటర్లు, ఎంఐ ఎకో సిస్టమ్ డివైజ్‌లు, యాక్ససరీ ప్రొడక్ట్‌లు ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఎంఐ సూపర్ సేల్ల్లో భాగంగా షావోమి ఈ రికార్డులను బ్రేక్ చేసింది. ఫెస్టివల్ కానుకగా నిర్వహిస్తున్న ఈ మూడు సేల్స్‌లో అమేజింగ్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నాయి. షావోమి ఈ రికార్డును అక్టోబర్ 9వ తేదీ రాత్రి 12 గంటల నుంచి అక్టోబర్ 11వ తేదీ రాత్రి 7 గంటల మధ్యలో సాధించినట్టు షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ వీపీ మను కుమార్ జైన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ అనూహ్యమైన స్పందనకు, ప్రేమకు ఎంఐ అభిమానులందరికీ మను కుమార్ జైన్ కృతజ్ఞతలు తెలిపారు. ఫెస్టివల్ సేల్స్‌లో భాగంగా షావోమి ప్రొడక్ట్‌లపై అందిస్తున్న ఆఫర్లు.... రెడ్మి నోట్ 5 ప్రొ రూ.2000 డిస్కౌంట్లో లభ్యమవుతుంది. హెచ్డీఎఫ్సీ కార్డులపై 10 శాతం తగ్గింపు లభిస్తోంది. దీంతో మొత్తంగా ఈ ఫోన్ రూ.11,699కే అందుబాటులోకి వస్తోంది. రెడ్మి వై2(3జీబీ+32జీబీ) ఫోన్, రెడ్మి వై2(4జీబీ+64జీబీ) స్టోరేజ్ ఫోన్ రూ.1000, రూ.2000 డిస్కౌంట్లో విక్రయానికి వచ్చింది. ఎంఐ మిక్స్ 2 ధర రూ.7000 తగ్గింది. దీంతో ఇది రూ.22,999కే లభ్యమవుతుంది. ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(32), ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(43) ధరలు రూ.500, రూ.2000 మేర తగ్గాయి. డిస్కౌంట్ అనంతరం ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(32), ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(43)లు రూ.13,499కు, రూ.20,999కు విక్రయానికి వచ్చాయి. 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ 2ఐ రూ.699కే విక్రయిస్తున్నాయి. 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ 2ఐ రూ.1399కు లభ్యమవుతోంది. -
ఫెస్టివల్ గిఫ్ట్: ఫ్లిప్‌కార్ట్‌లో 30వేల ఉద్యోగాలు
బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్స్‌తో పాటు, భారీగా ఉద్యోగాల జాతరకు తెరలేపింది. రాబోతున్న ఫెస్టివల్ సేల్ కోసం 30వేల సీజనల్ ఉద్యోగాలను అందించింది. ఈ ఉద్యోగాలు ఎక్కువగా సప్లయి చైన్, లాజిస్టిక్స్ ఆపరేషన్లలో కల్పించింది. ఈ పండుగ సేల్‌లో అమెజాన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు, ఫ్లిప్‌కార్ట్ ఈ మేరకు సన్నద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ తన నాలుగో ఎడిషన్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను అక్టోబర్ 10 నుంచి 14 వరకు నిర్వహించబోతుంది. ఈ సేల్ జరిగే సమయంలో, ఫ్లిప్‌కార్ట్ విక్రయ భాగస్వాములు కూడా తమ ప్రాంతాల్లో పరోక్షంగా ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. తమ వినియోగదారులకు సజావుగా షాపింగ్ అనుభవాన్ని అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. సప్లయి చైన్ వ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్ ఈ సీజనల్ ఉద్యోగాలను కల్పించింది. వీటిలో వేర్‌హౌజ్‌లు, మదర్ హబ్స్, డెలివరీ హబ్స్ ఉన్నాయి. ప్యాకేజింగ్, వేర్‌హౌజ్ మేనేజ్మెంట్లలో అదనంగా పరోక్ష ఉద్యోగాలను కూడా సృష్టించింది ఫ్లిప్‌కార్ట్. ఫెస్టివల్ సేల్‌లో ఎక్కువ మొత్తంలో వచ్చే ఆర్డర్లను సజావుగా చేపట్టేందుకు ఈ-కామర్స్ కంపెనీలు ప్రతి సీజన్లోనూ వేలమంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటాయి. అమెజాన్ ఇండియా కూడా దేశవ్యాప్తంగా 50వేల సీజనల్ ఉద్యోగాలను సృష్టించింది. రాబోతున్న ఫెస్టివల్ సేల్‌లో 20 మిలియన్‌కు పైగా వినియోగదారలు పలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై షాపింగ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి వాటికి 3 బిలియన్ డాలర్ల విక్రయాలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని రీసెర్చ్ సంస్థ రెడ్‌షీర్ రిపోర్టు పేర్కొంది. ఆఫ్‌లైన్ రిటైలర్లకు కూడా ఈ దసరా, దివాళి ఫెస్టివల్ సీజన్లో విక్రయాలు భారీగానే నమోదవుతాయి. వార్షిక విక్రయాలను పెంచుకోవడానికి ఈ కంపెనీలకు సెప్టెంబర్-నవంబర్ కాలమే అత్యంత కీలకం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు స్నాప్‌డీల్ కూడా ‘మెగా దివాళి సేల్’ను అక్టోబర్ 10 నుంచి 14 వరకు నిర్వహించబోతుంది. ప్రస్తుతం నియమించుకున్న ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ ఉద్యోగులు టెక్‌తో నడిచే సప్లయి చైన్, ఫుడ్ టెక్, ఇతర సంబంధిత పరిశ్రమల్లో పనిచేసేందుకు ఈ అనుభవం ఉపయోగపడనుంది. -
భారీ డిస్కౌంట్లకు ఇదే చివరి అవకాశం
న్యూఢిల్లీ : ఈ పండగ కాకపోతే.. వచ్చే పండగ. లేదా ఆ తర్వాత ఫెస్టివల్‌కు చూసుకోవచ్చులే. ఏదైనా కొత్త వస్తువు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చులే, డిస్కౌంట్లు ఎలాగో ప్రతి పండగకు ఉంటాయిలే అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లియెన్స్, స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందడానికి ఇదే చివరి అవకాశమట. వచ్చే దివాళి సేల్ అనంతరం, ఈ వస్తువులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లు పొందాలంటే కాస్త కష్టతరమేనట. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఈ వస్తువులపై కస్టమ్ సుంకాన్ని పెంచింది. ఈ సుంక పెంపు నేపథ్యంలో వచ్చే పండగ సీజన్ తర్వాత వీటిపై ధరలు పెంచాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయి. షావోమి, హానర్, వన్‌ప్లస్, శాంసంగ్, ఆసుస్ వంటి స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఈ పండగ సీజన్ వరకు ఎలాంటి ధరలు పెంచకూడదని నిర్ణయించి, ఆ తర్వాత నుంచి ధరల పెంపు చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. అలాగే వైట్ గూడ్స్ తయారీదారులు పానాసోనిక్, బోస్, బీఎస్‌హెచ్ ఎలక్ట్రానిక్స్ కూడా పండగ సీజన్ వరకు ధరలు పెంచకూడదని నిర్ణయించాయి. రూపాయి క్షీణిస్తున్న నేపథ్యంలో, కరెంట్ అకౌంట్ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని పెంచింది. సరిగ్గా పండగ సీజన్‌కు ముందు ఈ ప్రకటన చేయడంతో, ఈ సారి డిస్కౌంట్లు ఉంటాయో ఉండవోనని వినియోగదారులు తెగ ఆందోళన చెందారు. కానీ ఈ పండగ సీజన్ వరకు ధరలు పెంచకుండా ఉండేందుకు కంపెనీల వద్ద ఇన్వెంటరీ ఉందని, ఈ పండగ సీజన్ అయిపోయిన వెంటనే కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయని పలు రిపోర్టులు పేర్కొన్నాయి. ‘రూపాయి క్షీణత నిజంగా పెద్ద తలనొప్పి. సాధారణంగా స్మార్ట్‌ఫోన్ ధరలు 10 శాతం వరకు పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ధరలు పెంచకూడదని నిర్ణయించాం. అంతేకాక సేల్స్ వాల్యుమ్ పెంచేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నాం’ అని హువావే, హానర్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పీ సంజీవ్ తెలిపారు. వెంటనే ధరల పెంపు చేపట్టి, వినియోగదారులపై భారం వేయకుండా.. ఈ ఏడాది ముగింపు నాటికి ధరలను పునఃసమీక్షిస్తామని వన్‌ప్లస్, షావోమి తెలిపాయి. ఈ పండగ సీజన్ వరకు అయితే డిస్కౌంట్లను, ఆఫర్లను కొనసాగిస్తామని పేర్కొన్నాయి. -
రూ. 1590కే విమాన టికెట్లు
దసరా, సంక్రాంతి సీజన్లలో ఇళ్లకు వెళ్లడానికి బస్సు, రైలు టికెట్లు దొరకడం లేదా? అయినా ఏమీ ఆందోళన అక్కర్లేదు. హాయిగా విమానం ఎక్కి మరీ వెళ్లిపోవచ్చు. అక్టోబర్ 20వ తేదీ.. అంటే మంగళవారం నుంచి 2016 ఫిబ్రవరి 29 వరకు చేసే ప్రయాణాలకు సంబంధించిన విమాన టికెట్లకు ఎయిర్ ఏషియా ఓ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. నవంబర్ ఒకటో తేదీలోగా టికెట్లు బుక్ చేసుకుంటే, పన్నులన్నీ కలిపి కనిష్ఠంగా రూ. 1590కే ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. బెంగళూరు నుంచి కొచ్చి, గోవా మార్గాల్లో వెళ్లడానికి రూ. 1590, అదే బెంగళూరు నుంచి పుణె అయితే రూ. 1990 ధర పెట్టిన ఎయిర్ ఏషియా, ఢిల్లీ- బెంగళూరు మార్గంలో మాత్రం రూ. 4290గా టికెట్ ధర నిర్ణయించింది. ఢిల్లీ-గోవా మార్గంలో రూ. 3990, గువాహటి -ఇంఫాల్ మార్గంలోను, ఢిల్లీ-గువాహటి మార్గంలోను రూ. 1690కి టికెట్లు ఉన్నాయి. నవంబర్ 1వ తేదీలోగా ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి. వచ్చే ఏడాది ప్రయాణం మరింత చౌక ఎయిర్ ఏషియా విమానాల్లో వచ్చే సంవత్సరం వేసవి నుంచి ప్రయాణాలు మరింత చవగ్గా చేయొచ్చు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి అక్టోబర్ 29 వరకు చేసే ప్రయాణాలకు కనిష్ఠ ధర రూ. 1299 అని ప్రకటించారు. ఈ ఆఫర్ కింద టికెట్లను మాత్రం అక్టోబర్ 25లోగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలలు పండుగ సీజన్లు కాబట్టి ఈ సమయంలో ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకోడానికి స్పైస్‌జెట్ సంస్థ అర్ధరాత్రి ప్రయాణాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తరహా విమాన సర్వీసులు ప్రధానంగా అమెరికా, యూరప్ దేశాల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. జెట్ ఎయిర్వేస్, ఇండిగో కూడా ఇలాంటి విమాన సర్వీసులను ప్రకటించాయి.