
Amazon Great Freedom Festival sale 2023 ఆన్‌లైన్ దిగ్గజం మరోసారి ఫెస్టివల్ సేల్‌ను షురూచేసింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ఆగస్ట్ 5వ తేదీన ప్రారంభం కానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో, అమెజాన్ ఇండియా అద్భుతమైన సేల్ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. వివిధ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది.
ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, హోం అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, తదితర పలు విభాగాల్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభించనున్నాయి. దీనికి తోడు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే కొనుగోళ్లపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
ప్రతీ ఆగస్ట్ నెలలో గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ప్రకటించే అమెజాన్ ఈ ఏడాది గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ తేదీలను శుక్రవారం ప్రకటించింది. ఈ సేల్ ఆగస్ట్ 5 నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. ప్రైమ్ మెంబర్స్ కు ఒక రోజు ముందే ఈ సేల్ ప్రారంభమవుతుంది అనేది తెలిసిన సంగతే. కొనుగోళ్లపై స్పెషల్ ఫ్లాట్ డిస్కౌంట్‌తోపాటు, బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్, వీటన్నింటికి తోడు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందుబాటులోఉంటాయి. ముఖ్యంగా ఈ సేల్ లో శాంసంగ్ వన్ ప్లస్, రియల్ మి, ఎంఐ తదితర కంపెనీల స్మార్ట్ ఫోన్స్ పై 40 శాతానికి మించి డిస్కౌంట్ లభించనుంది. (పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా పైపైకే)
వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి గృహోపకరణాలు కూడా ఆకర్షణీయమైన తగ్గింపు ధరల లభ్యం. సోనీ ప్లేస్టేషన్ 5 ఇతర గేమింగ్ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు. గేమ్‌లు కూడా గరిష్టంగా 80 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి. ల్యాప్‌టాప్‌లు , వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. టీజర్ పేజీ ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు మరియు అనేక ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా యాపిల్, తదితర కంపెనీల టాబ్లెట్‌లు గరిష్టంగా 50 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి.