రోజు రోజుకి మార్కెట్లో కొత్త మొబైల్ ఫోన్స్ విడుదలవుతుండటంతో వినియోగదారులు కూడా కొత్త ఉత్పత్తులను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వివో కంపెనీ ఎక్స్ ఫ్లిప్ ఫోల్డబుల్ అనే స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా శాంసంగ్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ తరహా మొబైల్స్ లాంచ్ చేశాయి. కాగా ఈ విభాగంలో వివో కూడా చేరనుంది. ఇందులో భాగంగా కంపెనీ విడుదలకానున్న కొత్త మొబైల్ మోడల్ నెంబర్ కూడా (V2256A) తెలిపింది. దీన్ని బట్టి చూస్తే ఇది త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
భారతీయ మార్కెట్లో విడుదలకానున్న వివో ఎక్స్ ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్, 50MP సోనీ IMX8606 ప్రైమరీ కెమెరా వంటి వాటితోపాటు 6.8 ఇంచెస్ 120Hz మెయిన్ డిస్‌ప్లే, పైన చిన్న సెకండరీ డిస్‌ప్లేను పొందుతుంది. మొత్తం మీద ఇది కొనుగోలుదారులను ఆకర్శించే విధంగా తయారైవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
(ఇదీ చదవండి: వేల కోట్ల కంపెనీకి బాస్ 'జయంతి చౌహాన్' గురించి ఆసక్తికర విషయాలు)
వివో ఎక్స్ ఫ్లిప్ అనేది చైనీస్ ఉత్పత్తి అయినప్పటికీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్‌లో 1,695 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్‌లో 4,338 పాయింట్లను స్కోర్ చేసింది. ఇది ఆధునిక ఫీచర్స్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ మొబైల్ ఫోన్ ధరలు ఇంకా వెల్లడి కాలేదు, కానీ దీని ధర సుమారు రూ. 79,990 వరకు ఉంటుందని అంచనా, ఇది ఏప్రిల్ 17న విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment