దీపావళి ఫెస్టివల్ సీజన్ సందర్భంగా కొత‍్త స్మార్ట్ ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకో శుభవార్త. దివాళీ ఫేస‍్టివల్ సందర్భంగా ఖరీదైన స్మార్ట్ ఫోన్ కేవలం రూ.101 డౌన్ పేమెంట్‌తో సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అదిరిపోయే దివాళీ సేల్ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.101 చెల్లించి స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చవని తెలిపింది. ఇక ఈ ఆఫర్ లో వివో ఎక్స్70 సిరీస్ కు చెందిన వివో వీ21, వివో వై 73, వివో వై33ఎస్ ఫోన్‌లు ఉన్నాయని వెల్లడించింది. నేటి నుంచి నవంబర్ 7వరకు అన్నీ ఆఫ్‌లైన్ ఛానళ్లలో అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. బజాజ్ ఫైనాన్స్‌లో డౌన్ పేమెంట్ కింద రూ.101 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ఫోన్ ధరను బట్టి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ను పొందాలంటే వివో ఫోన్ ధర రూ. 15,000 కంటే ఎక్కువ ధరను కలిగి ఉండాలి.
ఇదే కాదు.. ఇంకా ఆఫర్‌లు ఉన్నాయ్
వివో ఎక్స్70 సిరీస్ ఫోన్‌లను సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీబీ కార్డ్‌లతో కొనుగులో చేసిన కస్టమర్లకు 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వివో ఎక్స్ 70 సిరీస్, వీ21 5జీ, వీ 21 ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.
కస్టమర్‌లు క్రెడిట్ కార్డ్ లేకుండా ఈఎంఐ సదుపాయాన్ని అందించే 'జెస్ట్ మనీ' సంస్థ సాయంతో ఒక సంవత్సరం పొడిగించిన వారంటీ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. దీంతో పాటు రిలయన్స్ జియో నుండి రూ. 10,000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చని తెలుస్తోంది. అయితే వివో కస్టమర్‌లు పొందే జియో ప్రయోజనాల గురించి వివరాల్ని వెల్లడించలేదు.
వివో స్మార్ట్‌ఫోన్ ధరలు
వివో స్మార్ట్‌ఫోన్ ధరల విషయానికి వస్తే వివో ఎక్స్ 70ప్రో ప‍్లస్ వేరియంట్ 12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ వెర్షన్ ధర రూ.79,990కి అందుబాటులో ఉంటుంది.
వివో ఎక్స్ 70ప్రో 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ వేరియంట్ ధర రూ.46,990 అందుబాటులో ఉంది.
8జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్పేస్ వేరియంట్ ధరరూ 49,990
12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.52,990
వివో 21 8జీబీ ప్లస్128జీబీ వేరియంట్ ధర రూ.29,990
8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ ధర రూ.32,990
వివో వీ21ఈ 8జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ ధర రూ.24,990
వివో వై 73 ధర రూ.17,990 గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment