
వివో స్మార్ట్‌ఫోన్(ఫైల్)
ఆకట్టుకునే ఫీచర్లతో ఎప్పడికప్పుడూ కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసే చైనీస్ మొబైల్స్ తయారీదారి వివో, మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే తీసుకురాబోతుంది. 10జీబీ ర్యామ్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయబోతుందని లీకేజీలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ ఈ లీక్‌లు కనుక నిజమైతే, ఎప్పటి వరకు వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో ఇదే ప్రత్యేక ఆకర్షణ. వివో ఎక్స్‌ప్లే 7 పేరుతో దీన్ని లాంచ్ చేస్తుందని, ఇది 4కే ఓలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 845 ఎస్‌ఓసీ, 512 జీబీ స్టోరేజ్, అండర్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి అద్భుత పీచర్లతో రూపొందిందని తెలుస్తోంది. 4ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో డ్యూయల్ రియర్ కెమెరాను ఇది కలిగి ఉందని లీకేజీలు చెబుతున్నాయి.
10జీబీ ర్యామ్ కలిగిన ఈ ఫోన్ 256జీబీ, 512జీబీ రెండు స్టోరేజ్ వేరియంట్లలో రాబోతుందని తెలుస్తోంది. అయితే ధర, అందుబాటులో ఉండే వివరాలపై ఎలాంటి అప్‌డేట్ లేదు. కానీ వచ్చే కొన్ని వారాల్లో, ప్రారంభ ధర 500 డాలర్లకు అంటే రూ.31,800కు దీన్ని లాంచ్ చేస్తారని టాక్. 2016లో లాంచ్ చేసిన వివో ఎక్స్‌ప్లే 6కు సక్సెసర్‌గా దీన్ని తీసుకురాబోతుంది. స్పెషిఫికేషన్ల విషయంలోనూ 2018 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో ఇదీ ఒకటిగా నిలువనుంది. 10 జీబీ ర్యామ్ కలిగి, అండర్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. అండర్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వివో ఇటీవలే ఎక్స్ 20 ప్లస్ యూడీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.