ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో కీలక నిర్ణయం తీసుకుంది. వివో వై33 మోడల్ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా పెంచేసింది. వివో వై33 మోడల్‌పై సుమారు రూ. 1000 వరకు పెంచింది. దీంతో వివో వై33 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 18,990కు చేరుకుంది. ఈ ఏడాది ఆగస్టులో మీడియా టెక్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో వివో వై33 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వై 33 స్మార్ట్‌ఫోన్ పాత ధర రూ. 17,990 ఉంది. గత నెలలో ఒప్పో ఎ54, ఒప్పో ఎఫ్19 స్మార్ట్‌ఫోన్ ధరలను వెయ్యికిపైగా ఒప్పో కూడా పెంచింది.
చదవండి: డీమార్ట్ దెబ్బకు బిలియనీర్ అయిపోయాడే...!
వివో వై33 ఫీచర్స్...!
- 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్-11
- 8జీబీ ర్యామ్+ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
- మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్
- సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
- 50+2+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
- 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
- 5000ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ
- 18వాట్ ఫాస్ట్ చార్జింగ్
Comments
Please login to add a commentAdd a comment