
16 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వివో ఫోన్లు
చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారి వివో, తన రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. వివో ఎక్స్7, ఎక్స్ 7 ప్లస్ పేర్లతో ఈ ఫోన్లను ఆవిష్కరించింది. వివో ఎక్స్7 ధర దాదాపు రూ.25,000కాగా.. వివో ఎక్స్7 ప్లస్ ధరను ఇంకా వెల్లడించలేదు. వివో ఎక్స్7 ను జూలై 7 నుంచి, ఎక్స్7 ప్లస్ ను జూలై 15 నుంచి స్టోర్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది.
ఈ రెండు ఫోన్లు క్వాల్ కామ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్ తో పనిచేయనున్నాయి. ఈ రెండూ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లను సపోర్టు చేయనున్నాయి. మెటల్ డిజైన్ తో రూపొందిన ఈ ఫోన్లు, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పనిచేయనున్నాయి.
వివో ఎక్స్ 7 ఫీచర్లు...
5.2 అంగుళాల ఫుల్ హెచ్ డీ సూపర్ అమో ల్డ్ డిస్ ప్లే
13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా
16 మెగా పిక్సెల్ ముందు కెమెరా
డ్యూయల్ సిమ్
3000ఎంఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
బ్లూటూల్ 4.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, వైఫై 802, జీపీఆర్ఎస్/ఈడీజీఈ, 3జీ, 4 జీ, మైక్రో యూఎస్ బీ
వివో ఎక్స్7 ప్లస్ ఫీచర్లు...
5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ సూపర్ అమో ల్డ్ డిస్ ప్లే
16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
16 మెగా పిక్సెల్ ముందు కెమెరా
డ్యూయల్ సిమ్
4000ఎంఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్