
వివో వీ5 ప్లస్ ఐపీఎల్ స్పెషల్...స్పెషల్ కలర్‌లో
ఐపిఎల్ ఫీవర్ ను క్యాష్ చేసుకున్న వివో క్రికెట్ లవర్స్‌కోసం ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.
ఐపిఎల్ ఫీవర్ ను క్యాష్ చేసుకున్న వివో క్రికెట్ లవర్స్‌కోసం ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ముఖ్యంగా ఐపీఎల్ 10 సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని, వీ 5ప్లస్ పేరుతో సెల్ఫీ ప్రియుల కోసం దీన్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ నటి సోహా ఆలీ ఖాన్ ఈ స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేశారు. మాట్ బ్లాక్ లో ప్రత్యేకంగా లాంచ్ అయిన ఈ డివైస్‌లో మిగతా ఫీచర్లన్నీ దాదాపు పాత వివో5 ప్లస్‌ను పోలి వున్నా.. ఈ ఫోన వెనుక భాగంలో ప్రత్యేకంగా ఐపీఎల్ లోగోను ముద్రించడమే దీని ప్రత్యేకత . ఈ స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ.27,980గా నిర్ణయించింది. ఏప్రిల్ 10 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది. ఇప్పటివరకూ ఇది గోల్డ్ కలర్‌లో మాత్రమే లభ్యమవుతోంది.
క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకునే లక్ష్యంతో ఈ ఫోనును తీర్చిదిద్దినట్లు వివో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వివేక్ ఝాంగ్ పేర్కొన్నారు. ఐపీఎల్ 10వ వార్షికోత్సవంగా ఈ స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చినట్టు చెప్పారు. తమ వినియోగదారులకు కేవలం ఫోన్ అందించడమే కాకుండా... ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తంచుకునేలా చేయడమే తమ లక్ష్యమన్నారు.
వివో వీ 5 ప్లస్ ఫీచర్స్
5.5అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ డిస్‌ప్లే
1920 x 1080 రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్‌తో , ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్16మెగా పిక్సెల్ రియర్ కెమెరా
20 ఎంపీ ఫ్రంట్ కెమెరా
4జీబీ ర్యామ్
64జీబీ స్టోరేజ్,
3160 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం