హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీ సంస్థ వివో భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బెంగళూరు కేంద్రంగా ఇప్పటికే ఈ సంస్థకు చెందిన ఇండియా ఇన్నోవేషన్ టీమ్ పనిచేస్తోంది. భారత మార్కెట్‌కు ఎటువంటి ఫీచర్లు, టెక్నాలజీ అవసరమో అన్న అం శంపై ఈ బృం దం పెద్ద ఎత్తున అధ్యయనం చేస్తోందని వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ డైరెక్టర్ నిపుణ్ మార్యా తెలిపారు. వై95 మోడల్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారమిక్కడ తెలంగాణ సీవోవో జరు సున్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
‘చైనాలో అయిదు, యూఎస్‌లో ఒక ఆర్‌అండ్‌డీ కేంద్రం ఉంది. ఈ సెంటర్లలో 2,000 పైచిలుకు నిపుణులు పనిచేస్తున్నారు. ఇక నోయిడా ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 2.5 కోట్ల యూనిట్లు. ప్లాంటు వినియోగం పూర్తి స్థాయికి చేరుకుంది. నూతన ఫ్యాక్టరీ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది. విలువ పరంగా భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో 17.6 శాతం వాటాతో రెండవ స్థానంలో ఉంది’ అని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment