బీజింగ్ : స్మార్ట్‌ఫోన్ల తయారీలో కంపెనీలు కొత్త కొత్త టెక్నాలజీలతో పాటు వేగం విషయంలో ప్రత్యేక శ్రద్ద పెడుతున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్రస్థానం కోసం ఆరాటపడుతున్న చైనా కంపెనీ వివో సబ్‌బ్రాండ్ ఐక్యూ ద్వారా రంగంలోకి వచ్చింది. అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్‌లో హల్ చల్ చేయనుంది. ఏకంగా 12జీబీ ర్యామ్‌తో ఒక స్మార్ట్‌ఫోన్ తీసుకురానున్నట్టు ఐ క్యూ వెల్లడించింది. అంతేకాదు ఐ క్యూ బ్రాండ్ కింద కేవలం ప్రీమియం బాండ్లను మాత్రమే లాంచ్ చేస్తామని తెలిపింది. ఇందులో భాగంగా తొలి స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 1వ తేదీన లాంచ్ చేయబోతున్నామని కంపెనీ పేర్కొంది.
చైనాలో ఈ ఈవెంట్ నిర్వహిస్తామని చైనా సోషల్ మీడియా వైబోలో ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఇతర వివరాలను ఇంకా రివీల్ చేయకపోయినప్పటికీ అంచనాలు ఇలా ఉన్నాయి.
12 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్
క్వాల్కం స్నాప్‌డ్రాగన 855 ప్రాసెసర్
ట్రిపుల్ రియర్ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. అంతేకాదు 6వ తరం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌కూడా ఇందులో పొందుపర్చిందట.
See you in Shenzhen, 1st March!
— iQOO (@iQOOGlobal) February 20, 2019
Apply for the invitation for attending the launching event with free flight ticket and hotel https://t.co/aPLR9iIX6T https://t.co/9rEM1hKSwD pic.twitter.com/tP7h8BKWr1
Comments
Please login to add a commentAdd a comment