స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో 'వై3ఎస్' పేరుతో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ మిగిలిన బడ్జెట్ ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివో వై3ఎస్ ఫీచర్లు, ధర
ప్రస్తుతం మార్కెట్‌లో రూ.10వేలు, అంతకాన్న ధరల్లో లభించే స్మార్ట్ ఫోన్ల లో వివో వై3ఎస్ నిలిచింది. రూ.9,490 ఉన్న ఈ ఫోన్‌లో 6.51 అంగుళాల హెచ్‌డీ 1600*720 పిక్సెల్స్‌తో ఎల్‌సీడీ డిస్ ప్లే, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 11 గ్రో ఎడిషన్ + ఫన్‌టచ్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటే, సెల్ఫీ కెమెరాకు వాటర్ డ్రాప్ నాచ్ ఫీచర్ కూడా ఉంది. వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉన్న ఈ ఫోన్ 19 గంటల పాటు ఆన్‌లైన్ హెచ్‌డీ మూవీ చూడొచ్చని, 8 గంటలు గేమ్స్ ఆడొచ్చని కంపెనీ చెబుతోంది. వీటితో పాటు ఫేస్ అన్‌లాక్, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ 2.0 పోర్ట్, జీపీఎస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వివో వై3ఎస్ స్మార్ట్‌ఫోన్ స్టారీ బ్లూ, మింట్ గ్రీన్, పెరల్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉందని వివో ప్రతినిధులు తెలిపారు.
ఒక్కవేరియంట్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ లో 2జీబీ ర్యామ్ అండ్ 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం ఉంది. వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా క్లిక్, పేటీఎం, బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ స్టోర్, ఇతర రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. మూడు నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది.
చదవండి: గూగుల్ పిక్సెల్ 6 సిరీస్: సొంత చిప్‌తోనే అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే..
Comments
Please login to add a commentAdd a comment