ఇది స్మార్ట్‌ఫోనా..ల్యాప్‌ట్యాపా...! వివో నుంచి కళ్లుచెదిరే గాడ్జెట్‌..! | Vivo New Patent Hints Foldable Phone With A Laser Projection Keyboard | Sakshi
Sakshi News home page

Vivo: ఇది స్మార్ట్‌ఫోనా..ల్యాప్‌ట్యాపా...! వివో నుంచి కళ్లుచెదిరే గాడ్జెట్‌..!

Published Wed, Dec 1 2021 9:32 PM | Last Updated on Wed, Dec 1 2021 10:22 PM

Vivo New Patent Hints Foldable Phone With A Laser Projection Keyboard - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్స్‌ భారీగా ఆదరణను నోచుకుంటున్నాయి. ఇప్పటికే శాంసంగ్‌ లాంటి కంపెనీలు ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లను యేలుతున్నాయి. ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లపై వస్తోన్న ఆదరణతో ఒప్పో, వివో లాంటి కంపెనీలు కూడా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లను తయారుచేసే పనిలో నిమగ్నమైనా​యి.

ఇది స్మార్ట్‌ఫోనా..లేదా ల్యాప్‌ట్యాపా...! 
ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వివో అద్బుతమైన ఆవిష్కరణకు సిద్ధమైంది. ఫోల్టబుల్‌ స్మార్ట్‌ఫోన్లలో సరికొత్త ఆవిష్కరణతో వివో ముందుకురానుంది.  స్మార్ట్‌ఫోనా లేదా ల్యాప్‌ట్యాపా అన్నట్లుగా వివో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఉండనుంది. సాధారణంగా మనం వాడే ల్యాప్‌ట్యాప్‌లో స్క్రీన్‌తో పాటుగా కీబోర్డు హింజ్‌ సహయంతో కనెక్ట్‌ అయ్యి ఉంటాయనే విషయం తెలిసిందే. ప్రస్తుతం వివో ఇలాంటి ఆవిష్కరణను ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లో తెచ్చేందుకు సన్నాహాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. 



వివో హింజ్‌లెస్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌..!
వివో మూడు మడతలతో ఫోల్టబుల్‌ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పేటెంట్‌ కోసం ఈ ఏడాది జూన్‌లో USPTO (యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్‌ ట్రేడ్‌మార్క్ ఆఫీస్)కి ఫైల్ చేసినట్లు లెట్స్‌ గో డిజిటల్‌ వెల్లడించింది. ఇది మడతపెట్టినప్పుడు సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా కన్పిస్తూ టాబ్లెట్‌లా మారిపోతుంది. ఈ ఆవిష్కరణలో వర్చువల్‌ ప్రొజెక్షన్‌ కీబోర్డు హైలెట్‌గా నిలవనున్నుట్లు తెలుస్తోంది.  ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చిన ప్రొజెక్టర్‌ ద్వారా వర్చువల్‌ కీబోర్డు కన్పించనుంది. లెట్స్‌గోడిజిటల్‌ భాగస్వామ్యంతో పర్వేజ్‌ ఖాన్‌ అనే గ్రాఫిక్‌ డిజైనర్‌ వివో పేటెంట్‌కు అప్లై చేసిన మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ వీడియోను తయారుచేశారు. 

చదవండి: అదిరిపోయే ఫీచర్లతో షావోమీ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement