
జైపూర్: చైనా మొబైల్ కంపెనీ వివో భారత్‌లో రూ.4,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఇప్పటిదాకా భారత్‌లో రూ.400 కోట్లు పెట్టుబడులు పెట్టామని వివో ఇండియా డైరెక్టర్(బ్రాండ్ స్ట్రాటజీ) నిపుణ్ మర్య తెలిపారు. ప్రస్తుతం నోయిడాలో ఉన్న తమ ప్లాంట్ పూర్తి ఉత్పాదక సామర్థ్యంతో ఏడాదికి 2.5 కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోందని వివరించారు. తమ ఫోన్ల కోసం డిమాండ్ పెరుగుతోందని, ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడం కోసం రూ.4,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. దశలవారీగా ఈ పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు. గ్రేటర్ నోయిడాలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నామని, ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే, ఏడాదికి 5 కోట్ల ఫోన్లను ఉత్పత్తి చేస్తామని వివరించారు.
21 శాతం మార్కెట్ వాటా: భారత మొబైల్ మార్కెట్లో తమ వాటా 21.2 శాతమని, ఆఫ్‌లైన్ మార్కెట్లో రెండో అతి పెద్ద మొబైల్ కంపెనీ తమదేనని నిపుణ్ వివరించారు. భారత మార్కెట్ కోసం రెండు కొత్త మొబైల్ ఫోన్లను అందించనున్నామనితెలిపారు.