అభిప్రాయం
ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డు కుంటామనీ, అన్ని యూనియన్ల లీడర్లను తీసుకెళ్లి ప్రధానితో సమావేం ఏర్పాటు చేస్తామనీ టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అలాగే ‘ఎటువంటి త్యాగాల కోసమైనా సిద్ధం’ అన్నారు పవన్ కల్యాణ్. రాజీనామా పేరుతో ప్రగ ల్భాలు పలికారు గంటా శ్రీనివాసరావు. ప్రైవేటీకరణ వైపు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు వారి కోసం ఎదురు చూస్తున్నారు. ‘పొరపాటున జగన్ అనే వ్యక్తి ఓడిపోతే ప్రైవేటీకరణ తప్పద’ని జగన్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతోంది.
‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో దాదాపు 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. అటువంటి ప్లాంట్ 18 వేల మందికి ప్రత్య క్షంగానూ, 23 వేల మందికి పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తోంది. సాగర తీరాన నెలవై ఉన్న విశాఖ నగరానికి స్టీల్ ప్లాంట్ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. అంతే కాకుండా ఈ ప్లాంట్ ద్వారా రాష్ట్రానికి, కేంద్రానికి వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఆదాయం లభించింది.
ఇటువంటి కామధేనువు లాంటి ప్లాంట్ మూసి వేత దిశగా అడుగులు వేస్తోంది. అదీ పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ స్వార్థం వల్ల! ఇప్పటికే ఈ స్టీల్ ప్లాంట్‌లోని మూడు ఫర్నేస్‌లలో రెండు అన్నపూర్ణ, కృష్ణ పర్నేసులను ఆపేశారు. ప్రస్తుతం ఒకే ఒక్క ఫర్నేస్‌తో అతి తక్కువ ఉక్కును ఉత్పత్తి చేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ నడుస్తోంది. తాత్కాలిక ఉద్యోగులకు వేతనాల్లేవు.
రెండు నెలలుగా పర్మినెంట్ ఉద్యోగులకూ వేతనాల్లేవ్. పీఎఫ్ కట్టలేని పరిస్థితి ఏర్పడింది. కార్మికులకు అందించాల్సిన సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తున్నారు. కార్మి కులు దాదాపు 1300 రోజుల నుండి ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం స్పందించడం లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నది ఎన్డీయే కూటమే.
అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినా కూడా బాబు, పవన్‌లు కార్మికులను కలిసిన దాఖలాలు లేవు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి శ్రీనివాస వర్మ చాలా నిర్మొహమాటంగా పెట్టుబడుల ఉపసంహ రణ అనేది కేంద్ర ప్రభుత్వ విధానమని, అందులో భాగంగానే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వాటాలను వెనక్కు తీసుకుంటోందన్నారు. ఇక రాష్ట్ర మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జాడ ఎక్కడా కనిపించడం లేదు.
గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. ఆయన చిత్తశుద్ధితో నిజాయితీగా వ్యవహరించారు. సీఎంగా తనకు కేంద్రం వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించారు. 2021లోనే కేంద్రానికి నాలుగు పేజీల లేఖ రాస్తూ ఈ ప్లాంటు ఆవశ్యకతను చాలా స్పష్టంగా వివరించారు. దీనిని ఎటువంటి పరిస్థి తుల్లోనూ అమ్మివేయద్దని కోరారు.
ఇటువంటి లేఖనే టీడీపీ, జనసేన ఎందుకు రాయలేక పోతోంది? మోదీ, షా అంటే ఆ పార్టీల అధినేతలకు భయం అన్నది అర్థమ వుతోంది. కానీ, జగన్ నిర్మొహమాటంగా కేంద్రానికి చెప్పడమే కాకుండా విశాఖలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌ను కారుచౌకగా కేంద్రం అమ్మేస్తుందని చెప్పారు. ఆయన చెప్పింది ఇప్పుడు నిజమనే భావన కనిపిస్తోంది. ప్లాంట్ నష్టపోకుండా లాభాల్లో నడవాలంటే బొగ్గు గనులు, ఉక్కు గనులు కేటాయించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
ఈ ప్లాంటు ఏర్పాటైన తొలినాళ్లలో దీని ఉత్పత్తి సామర్థ్యం 3 మిలియన్ టన్నులు. దీనికి సొంతంగా ఉక్కు, బొగ్గు గనులు లేవు. వీటిని ప్రైవేటు సంస్థల నుండి, వేరే రాష్ట్రాల నుండి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరిగింది.
ఈ పరిస్థితుల్లో అనాలోచితంగా దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని 7 మిలియన్ టన్నులకు పెంచారు. దీంతో అప్పుల ఊబిలోకి ఇది కూరుకుపోయింది. ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు చేసిన రుణాలు కూడా పెద్ద భారంగా మారాయి. దీనిని సాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు సంస్థలకు విక్రయించే ప్రయత్నం చేయ బోతోంది.
ప్రైవేటైజేషన్‌లో భూమి ఎక్కువగా ఉంటే కొనేందుకు సంస్థలు ముందుకొస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే దాదాపు 20 వేల ఎకరాల భూమి ఉంది. ప్లాంటు పరిధిలో 11 వేలు, టౌన్ షిప్ పరిధిలో 500 ఎకరాలు, రిజర్వాయర్ పరిధిలో 500 ఎక రాలు, నిరుపయోగంగా మరో 7 వేల ఎక రాలు ఉన్నాయి.
ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంకు ఉంది కాబట్టి అనేక ప్రైవేటు సంస్థలు ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు గద్దల్లాగా వాలు తున్నాయి. ప్లాంట్‌ను కావాలనే నష్టాల్లోకి నెట్టి ఆ సాకుతో ప్రైవేటీకరించడానికి కేంద్రం సిద్ధమవుతోందన్న విమర్శ ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి.
కార్మికుల కడుపు కాలకముందే కేంద్ర పెద్దలు ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనలతో ప్లాంట్‌కు పున ర్జీవం పోయాలని ప్రజలు కోరుతున్నారు.
పూనూరు గౌతమ్ రెడ్డి
వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ‘ 98481 05455
Comments
Please login to add a commentAdd a comment