ఎన్నికల కోసం పొత్తులు పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి
ఈ విషయంలో వైఎస్సార్‌సీపీది ఒకటే వైఖరి
ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలతో సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తమ వైఖరి స్పష్టంచేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎండాడలో 21వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి (కార్మిక సంఘం) నాయకులు మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి విశాఖ స్టీల్‌ప్లాంట్ సమస్యలపై నివేదించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారితో మాట్లాడుతూ.. ‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీ స్టీల్‌ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలుస్తుంది.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకరిస్తూ కార్మికుల తరఫున మొట్టమొదట గళమెత్తిందే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. అదే విధంగా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారాలను ప్రతిపాదిస్తూ తాను స్వయంగా ప్రధానికి లేఖ రాశాను’.. అని గుర్తుచేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీది రాజీలేని ధోరణి అని జగన్ స్పష్టంచేశారు.
ఇనుప ఖనిజం గనులను శాశ్వతంగా కేటాయించడంవల్ల ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుందని, ప్లాంట్ పునరుద్ధరణకు తాము శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నామని ఆయన కార్మికులకు చెప్పారు. ఈ ఎన్నికల్లో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికుల మద్దతును కోరే నైతికత వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఉందని, ఎందుకంటే మా పార్టీ మాత్రమే కార్మికులకు అండగా నిలిచిందన్నారు.
ఈ అంశంపై టీడీపీ, బీజేపీ రెండూ విభిన్న నిర్ణయాలు ప్రకటించాయని, ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్న కూటమి పార్టీలు ఈ విషయంపై తమ నిర్ణయాన్ని స్పష్టంచేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. కూటమిగా ఏర్పడిన టీడీపీ–జనసేన–బీజేపీ స్టీల్‌ప్లాంట్ విషయంలో తమ నైతికతను, విలువలు మరిచాయని విమర్శించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పోరాట కమిటీ నాయకులు సీహెచ్. నర్సింగరావు, డి. ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, వై. మస్తానప్ప ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment