సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు (ఆర్‌ఐఎన్‌ఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణ యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర ఉక్కు శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పురోగతిలోనే ఉందని తెలిపింది. పనితీరును మెరుగుపర్చుకునేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోందని శుక్రవారం ఒక ప్రకటనలో వివరించింది.
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేస్తోందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ ఈ మేరకు వివరణ ఇచ్చింది. వైజాగ్ స్టీల్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7 మిలియన్ టన్నులు. కంపెనీలో ప్రభుత్వానికి ఉన్న 100 శాతం వాటాలను విక్రయించే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) 2021 జనవరి 27న ఆమోదముద్ర వేసింది.
Comments
Please login to add a commentAdd a comment