
ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్న నారాయణమూర్తి
కృష్ణలంక (విజయవాడ తూర్పు): ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కును కాపాడుకుని తీరుతామని సినీ దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జాషువా సాంస్కృతిక వేదిక, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, 64 కళలు.కామ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నాడు–నేడు ఫొటో ఎగ్జిబిషన్‌ను, ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి, విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా కళాకారులు ప్రదర్శించిన పెయింటింగ్స్, కార్టూన్స్ ఎగ్జిబిషన్‌ను నారాయణమూర్తి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు.