
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకణకు వ్యతిరేకంగా పరీరక్షణ కమీటి చేస్తున్న పోరాటనికి తన మద్దతు ప్రకటిస్తునట్లు పేర్కొన్నారు. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతనే ఉన్నాయని పేర్కొన్నారు. ‘విశాఖ ఉక్కు’కు దేశంలోనే ఓ ప్రత్యేకత ఉందని తెలిసి గర్వించామని చిరంజీవి గుర్తుచేశారు.
లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిని విశాఖ ఉక్కును ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలకు కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నాని తెలిపారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని సూచించారు. ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయమైన హక్కు అని.. ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందామని ఆయన ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది.
Visakha Steel Plant is a symbol of numerous sacrifices.Let's raise above parties and regions.
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2021
With a Steely resolve,
Let's save Visakha Steel plant! pic.twitter.com/jfY7UXYvim
Comments
Please login to add a commentAdd a comment