ప్రైవేటీకరణను వ్యతిరేకించండి  | R Narayana Murthy On Privatization | Sakshi
Sakshi News home page

ప్రైవేటీకరణను వ్యతిరేకించండి 

Published Wed, Jun 1 2022 4:16 AM | Last Updated on Wed, Jun 1 2022 4:16 AM

R Narayana Murthy On Privatization - Sakshi

పెనమలూరు: ప్రైవేటీకరణను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని ప్రముఖ సినీ దర్శక, నిర్మాత, నటుడు ఆర్‌.నారాయణమూర్తి పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో జరుగుతోన్న ప్రజానాట్య మండలి రాష్ట్ర 10వ మహాసభల ముగింపు కార్యక్రమంలో మంగళవారం  ఆయన ప్రసంగించారు. దేశంలో జరుగుతోన్న ప్రైవేటీకరణ చాలా ప్రమాదకరమైన పరిణామమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.  

రాష్ట్ర కమిటీ నియామకం 
ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీని నియమించారు. అధ్యక్ష కార్యదర్శులుగా పి.మంగరాజు, ఎస్‌.అనిల్‌కుమార్, ఉపాధ్యక్షులుగా గుర్రం రమణ, సుభాషిణి, సహాయ కార్యదర్శులుగా షేక్‌.కాశిం, ఐ.వెంకటేశ్వరరావులను నియమించారు. వీరితో పాటు మరో 38 మంది కార్యవర్గ సభ్యులూ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement