పీవీ సింధు ఖాతాలో మరో బ్రాండ్ | P V Sindhu new brand ambassador of Vizag Steel | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 8 2016 2:51 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి, రియో ​ఒలంపిక్ రజత పతక విజేత పీవీ సింధు మరో ప్రత్యేకతను తన ఖాతాలో వేసుకుంది. ప్రఖ్యాతి గాంచిన వైజాగ్ స్టీల్ సంస్థ , రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైంది. బేస్లైన్ వెంచర్స్, డైరెక్టర్ , మరియు సహ వ్యవస్థాపకుడు ఆర్ రామకృష్ణన్ ఈ ఒప్పంద వివరాలు వెల్లడించారు. దీంతో వైజాగ్ స్టీల్ అథ్లెట్ రంగంలో ప్రధాన భాగస్వామి మారిందని చెప్పారు. దీని ప్రకారం బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, భారతదేశం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మరియు దేశీయ పోటీలలో సింధు ఆడే సమయంలో ఆమె జెర్సీ మీద కంపెనీ బ్రాండ్ లోగో ఉండనుందని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement