కత్తులతో తెలుగు తమ్ముళ్ల బెదిరింపు
Published Thu, Feb 23 2017 12:17 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
ఆలూరు: తమకు మామూళ్లు ఇవ్వాలని విండ్ పవర్ కంపెనీల సిబ్బందిని టీడీపీ నాయకులు కత్తులతో బెదిరించారు. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇవీ. ఆలూరు నియోజకవర్గంలోని మొలగవెల్లి, హత్తిబెళగళ్, పెద్ద హోతూరు, ఆస్పరి, చిన్నహోతూరు, పెద్దహోతూరు ఆలూరు తదితర గ్రామాల పరిధిలో గమేషా, లోటర్, సుజనా తదితర విండ్ పవర్ కంపెనీలు.. ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందు కోసం వీరు రైతుల వద్ద వ్యవసాయ భూములను కొనుగోలు చేసేవారు. రైతులకు నష్టపరిహారం చెల్లించడం లేదని గత నెలలో టీడీపీ నాయకులు కంపెనీ సిబ్బందిపై అగ్రహం వ్యక్తం చేయడంతో పంచాయితీ జరిగింది. పనులకు ఇసుక, రాయి తామే సరఫరా చేస్తామని టీడీపీ నాయకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే మూడు రోజుల క్రితం.. విండ్ పవర్ కంపెనీలు తమకు మామూళ్లు ఇవ్వడం లేదని దాదాపు 12మంది టీడీపీ నాయకులు ఫూటుగా తాగి కత్తులు, పిడిబాకులతో సిబ్బందిని బెరించారు. సెక్యూరిటీ గాడ్స్ ఆలూరు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు అక్కడి చేరుకొనే సరికి టీడీపీ నాయకులు వెళ్లిపోయారు.
Advertisement
Advertisement