హైదరాబాద్: ఓ యువతిపై ఆమె సొంత మేనమామే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. అజయ్ అనే యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న తన మేనకోడలిని కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగక ఆమె నగ్న ఫొటోలను సెల్‌ఫోన్‌లో తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికినైనా చెబితే ఫొటోలు ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.