
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మహానంది(కర్నూలు): మహిళా భక్తుల పట్ల ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆదివారం రాత్రి స్థానికులు సదరు యువకున్ని చితకబాదారు. వివరాలు.. తాడిపత్రికి చెందిన కొందరు భక్తులు మహానందీశ్వరుడి దర్శనార్థం మహానందికి వచ్చారు. అందులో మహిళలు బహిర్భూమికి ఆలయం వెనుక పరిసరాలకు వెళ్లగా మరుగుదొడ్ల నిర్వాహకుల వద్ద పనిచేసే ఓ యువకుడు యజమానులు చెప్పారని ఫొటోలు తీయడంతో వివాదాస్పదమైంది.
దీంతో భక్తులు యువకుడిని చితకబాదారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం భక్తులు స్టేషన్‌కు చేరుకుని నిర్వాహకులను పిలిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు వచ్చి క్షమాపణలు చెప్పడంతో పాటు ఫొటోలు డిలీట్ చేయడంతో వివాదం సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment