woman devotee
-
బహిర్భూమికి వెళ్లిన మహిళల పట్ల అసభ్యప్రవర్తన.. ఫొటోలు తీసి
సాక్షి, మహానంది(కర్నూలు): మహిళా భక్తుల పట్ల ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆదివారం రాత్రి స్థానికులు సదరు యువకున్ని చితకబాదారు. వివరాలు.. తాడిపత్రికి చెందిన కొందరు భక్తులు మహానందీశ్వరుడి దర్శనార్థం మహానందికి వచ్చారు. అందులో మహిళలు బహిర్భూమికి ఆలయం వెనుక పరిసరాలకు వెళ్లగా మరుగుదొడ్ల నిర్వాహకుల వద్ద పనిచేసే ఓ యువకుడు యజమానులు చెప్పారని ఫొటోలు తీయడంతో వివాదాస్పదమైంది. దీంతో భక్తులు యువకుడిని చితకబాదారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం భక్తులు స్టేషన్కు చేరుకుని నిర్వాహకులను పిలిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు వచ్చి క్షమాపణలు చెప్పడంతో పాటు ఫొటోలు డిలీట్ చేయడంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: కారులో వెళ్తున్న వివాహితను వెంబండించి.. ఆతర్వాత -
పాము ప్రత్యక్షం, భయంతో పరుగులు...
సాక్షి, కాకినాడ : నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు వెళ్లిన భక్తులకు ఊహించని షాక్ తగిలింది. ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో భక్తులు అక్కడ నుంచి పరుగులు తీసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో సోమవారం చోటుచేసుకుంది. సోమవారం నాగులచవితి పర్వదినం సందర్భంగా మహిళలు... పుట్టలో పాలు పోసేందుకు వచ్చారు. పూజల చేసిన అనంతరం పుట్టలో పాలు పోయడంతో ఒక్కసారిగా పాము బయటకు వచ్చింది. దీంతో బిత్తరపోయిన మహిళలు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కానిస్టేబుల్ను చెప్పుతో కొట్టిన మహిళ
తిరుపతి: కలియుగ వైకుంఠం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అలిపిరి చెక్ పోస్టు వద్ద భద్రతా సిబ్బంది దురుసు ప్రవర్తనతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో భద్రత్రా సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగుతుండడం నిత్యకృత్యంగా మారింది. అలిపిరి చెక్ పోస్టు వద్ద తనిఖీల సందర్భంగా ఓ కానిస్టేబుల్కి, భక్తురాలికి మధ్య ఆదివారం వివాదం చోటుచేసుకుంది. మాటా మాటా పెరగడంతో సహనం కోల్పోయిన భక్తురాలు కానిస్టేబుల్ను చెప్పుతో కొట్టింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అలిపిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.