కలియుగ వైకుంఠం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అలిపిరి చెక్ పోస్టు వద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తిరుపతి: కలియుగ వైకుంఠం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అలిపిరి చెక్ పోస్టు వద్ద భద్రతా సిబ్బంది దురుసు ప్రవర్తనతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో భద్రత్రా సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగుతుండడం నిత్యకృత్యంగా మారింది.
అలిపిరి చెక్ పోస్టు వద్ద తనిఖీల సందర్భంగా ఓ కానిస్టేబుల్కి, భక్తురాలికి మధ్య ఆదివారం వివాదం చోటుచేసుకుంది. మాటా మాటా పెరగడంతో సహనం కోల్పోయిన భక్తురాలు కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అలిపిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.