తీవ్రంగా గాయపడిన లక్ష్మి
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ముగ్గురిపై కత్తితో దాడి చేసిన సంఘటన కొత్తగూడెం మండల పరిధిలోని కారుకొండపంచాయతీ తెలగ రామవరం ఎస్సీ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది.
-
ఒకరి పరిస్థితి విషమం– ఇద్దరికి స్వల్ప గాయాలు
కొత్తగూడెం క్రైం: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ముగ్గురిపై కత్తితో దాడి చేసిన సంఘటన కొత్తగూడెం మండల పరిధిలోని కారుకొండపంచాయతీ తెలగ రామవరం ఎస్సీ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ బూర రాజగోపాల్ కథనం ప్రకారం... ఎస్సీ కాలనీకి చెందిన జక్కం రాజేందర్‌కు మెుదటి భార్యతో గొడవల కారణంగా విడాకులు ఇచ్చాడు. 2015లో లక్ష్మిదేవిపల్లికి చెందిన జక్కం సుజాతను రెండో వివాహం చేసుకున్నాడు. అనంతరం వీరిద్దరి మధ్య కూడా గొడవల కారణంగా సుజాత పుట్టింటికి వెళ్లింది. జీవనధారం కోసం ఓ షాపులో గుమస్తాగా పని చేస్తున్న సుజాతను రాజేందర్ కొద్ది రోజులుగా షాపు వద్దకు వెళ్లి వేధించసాగాడు. ఈ క్రమంలో ఇరువురు ఆదివారం పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుద్దామని ఒప్పందం కుదుర్చుకొని, పెద్ద మనుషుల సమక్షంలో మట్లాడారు. అయితే రాజేందర్ పెద్ద మనుషుల మాట వినకపోవడంతో సుజాత ఇంకా కొన్ని రోజులు పుట్టింటిలోనే ఉందామని నిర్లయించుకుంది. ఇంట్లో ఉన్న దుస్తులు తెచ్చుకోవడానికి సుజాత ఇంట్లోకి వెళ్లగా భర్త రాజేందర్ వెనుక నుంచి ఇనుప రాడ్డు తీసుకువచ్చి కుడి భుజంపై కొట్టడంతో గమనించి చెల్లెలు కళ్యాణి, తల్లి లక్ష్మిలు ఇంట్లోకి రాగా వారిని కూడా కత్తితో బలంగా దాడి చేశాడు. వెంటనే సుజాత తన చెల్లి, తల్లిని ఆటోలో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేయించింది. అనంతరం త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.