కొత్తకోట: మానసిక స్థితి సరిగా లేని ఓ వృద్దుడు గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘంటన వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక బుడగజంగాల కాలనీకి చెందిన రామస్వామి(70), అచ్చమ్మలు దంపతులు. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలందరూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా రామస్వామి మానసికస్థితి సరిగా లేక జీవసమాధి అవుతానంటూ కుటుంబీకులను బెదిరించేవాడు. ఈ క్రమంలో పెద్ద కొడుకు శివ, కోడలు పద్మలతో రామస్వామి తరచూ గొడవపడేవాడు.
మూడు రోజుల క్రితం పద్మను రామస్వామి గాయపరచడంతో పెద్దలు మందలించారు. ఆదివారం ఉదయం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రామస్వామి కూరగాయలు తరిగే కత్తితో గొంతు కోసుకున్నాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే క్షతగాత్రుడిని ప్రైవేటు వాహనంలో వనపర్తికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలోనే రామస్వామి మృతిచెందాడని ఏఎస్సై సత్తార్ తెలిపారు.
గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Published Sun, Mar 19 2017 10:57 PM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM
Advertisement
Advertisement