family conflicts
-
ఈ తరం తీరే వేరు!.. ఆనందం తక్కువ ఎందుకంటే...
జీవితానికి అర్థం, పరమార్థం జీవించడమే, ఆనందంగా జీవించడమే. మనం ఉద్యోగం సాధించినా, ఇల్లు కట్టించినా, కారు కొన్నా, విదేశీ ప్రయాణం చేసినా, మరే పని చేసినా సరే.. లక్ష్యం ఆనందం. ఆనందాన్ని వెంబడించడమనేది శాశ్వతమైన మానవ ప్రయత్నం. అయితే కాలంతో పాటు దాన్ని సాధించే మార్గాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా ప్రతి 15 సంవత్సరాలను ఒక జనరేషన్గా పరిగణిస్తారు. జనరేషన్ జనరేషన్ కూ ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి. 1965-80 మధ్య పుట్టిన జనరేషన్-ఎక్స్ వారికి ఆర్థిక భద్రత సాధించడం, పిల్లలు సాధించేలా చూడటం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించడమే లక్ష్యంగా ఉండేది. అందులోనే వారు ఆనందాన్ని పొందేవారు. 1981-1996 మధ్య పుట్టిన జనరేషన్-వై వారికి వ్యక్తిగత ఎదుగుదల, మంచి కుటుంబ జీవితం ఆనందాన్నిచ్చేవి. వారితో పోల్చినప్పుడు 1997-2012 మధ్య పుట్టిన జనరేషన్-జీ వారిలో ఆనందం తగ్గిందని, కేవలం మూడింట రెండు వంతుల మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని గాలప్ సర్వే కనుగొంది. యుక్త వయసులోకి ప్రవేశించినప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కారణం తెలుసా? ఈ తరం వారికి ఆర్థిక భద్రత, వ్యక్తిగత ఎదుగుదల కంటే కూడా పని చేయడంలో ప్రయోజనం (sense of purpose) ముఖ్యం. ఆ క్లారిటీ ఉన్నప్పుడు, ఉన్నవారు మాత్రమే సంతోషంగా జీవిస్తున్నారు. నా పనికి ప్రయోజనం ఉందా? ఈ తరం వారికి కార్పొరేట్ నిచ్చెనలు ఎక్కడంపైనే, మెటీరియలిస్టిక్ విజయాలు సాధించడంపైనే దృష్టి ఉంటుందని చాలామంది విమర్శిస్తుంటారు. కానీ అదంతా అబద్ధమని సర్వేలో తేలింది. పాత తరాలకు భిన్నంగా జనరేషన్-జీ వారు తమ పనికి, జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలని కోరుకుంటున్నారు. అయితే, ఈ తరం వారికి అందుబాటులో ఉన్న ఉద్యోగాలలో ఈ అంతర్గత ప్రేరణ లేదు. ఆఫీసుల్లో ఏ అంశంపైనైనా బహిరంగంగా మాట్లాడే స్వభావం, దాన్ని భరించలేని పాతకాలపు వర్క్ ప్లేస్ లు వారిలో అసంతృప్తిని పెంచుతున్నాయి. అంటే ఈ తరం వారికి భారీగా జీతాలు అందుకోవడం లేదా ప్రమోషన్లు పొందడం కంటే కూడా తాము చేస్తున్న పనివల్ల ఎవరికైనా, ఏదైనా ప్రయోజనం ఉందా? వారి జీవితాలను ప్రభావితం చేయగలుగుతున్నామా? అనేది చాలా ముఖ్యం. అలాంటి ప్రయోజనం ఉన్నప్పుడే పనిలో ఆనందాన్ని పొందుతున్నారు. ఈ మూడూ ఉంటేనే సంతోషం జనరేషన్-జీ ఆనందంలో ప్రయోజనంతోపాటు మరో మూడు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని గాలప్ అధ్యయనం గుర్తించింది. అవి... రీఛార్జ్, రిలాక్సేషన్: హైపర్ కనెక్టివిటీ వల్ల ప్రపంచం నిరంతరం మేల్కొనే ఉంటుంది. అందువల్ల చాలామందికి నిద్ర కరువవుతోంది. తగినంత విశ్రాంతి, నిద్ర పొందడం ఆనందానికి మార్గమవుతోంది. బలమైన సామాజిక సంబంధాలు: సోషల్ మీడియా యుగంలో ఒక్కొక్కరికీ వేలల్లో, లక్షల్లో ఆన్లైన్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల ప్రేమ, మద్దతు పొందడం చాలా ముఖ్యం. వారితో సన్నిహిత సంబంధాలే సంతోషానికి మార్గాలవుతాయి. పోలికనుండి తప్పించుకోవడం: సోషల్ మీడియాలో లేదా మరెక్కడైనా నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. జనరేషన్-జీలో ఈ కంపేరిజన్ ట్రాప్ చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి అవగాహన పెంచుకోవడం, ప్రతీ వ్యక్తి ప్రత్యేకమని గుర్తించి ముందుకు సాగడం ఆనందం జీవనం కోసం అద్భుతమైన వ్యూహం. విద్యాసంస్థలు, కార్యాలయాలు ఈ అంశాలను గుర్తించి జనరేషన్-జీ దీర్ఘకాలిక ఆనందాన్ని సాధించడంలో మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
కలకలం రేపిన దంపతుల కౌన్సెలింగ్
తూప్రాన్: నవ దంపతుల మధ్య ఉన్న విభేదాలు ఇరువర్గాల మద్య దూరం పెంచాయి. పోలీస్‌స్టేషన్‌లో కౌన్సిలింగ్ దాక వెళ్లిన ఈ ఘటన పరస్పర దాడులకు పాల్పడే స్థితికి దారి తీసింది. తూప్రాన్ పోలీస్‌స్టేషన్ ఎదుట సోమవారం చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తూప్రాన్ మండలం జెండాపల్లికి చెందిన యువతిని గత నాలుగు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన యువకుడితో పెళ్లి చేశారు. వీరి కాపురం సజావుగా సాగిన నాలుగు నెలల అనంతరం భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. యువతి కుటుంబ సభ్యులు తూప్రాన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో యువకుడితో పాటు వారి కుటుంబ సభ్యులు సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు ఇరు కుటుంబసభ్యులు, పెద్దల సమక్షంలో నవ దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంతో నెల రోజుల తర్వాత మాట్లాడుకుంటామని పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. కోపోద్రికులైన అమ్మయి తరుపువారు అబ్బాయి కుటుంబ సభ్యులపై దాడికి యత్నించారు. పోలీసులు కలుగజేసుకొని ఇరువర్గాల వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ క్రమంలోనే యువకుడి కుటుంబ సభ్యులు కారులో హైదరాబాద్ వెళ్తుండగా వెనుకాల నుంచి వెంబడించిన యువతి కుటుంబ సభ్యులు వారిని పట్టణంలోని శివాలయం ఎదురుగా అడ్డగించి కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. అలాగే యువకుడిని చితకబాదారు. స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. తిరిగి వారిని హైదరాబాద్ పంపించి వేశారు. కాగా ఈ సంఘటన తూప్రాన్ పట్టణంలో కలకలం రేపింది. -
పెద్దల కోపం.. పిల్లలకు మరణశాసనం
దంపతుల మధ్య కొరవడిన సఖ్యత చిన్నారులకు శాపంగా మారింది. భర్తపై ఉన్న కోపంతో ఆ ఇల్లాలు చివరకు పేగుబంధాన్ని కూడా విస్మరించింది. అభం.. శుభం తెలియని ఆ చిన్నారులను చివరకు చెరువులోకి తోసేసి ఉసురు తీసింది. ఆపై తానూ తనువు చాలించాలనుకుని విరమించుకుంది. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటక్రైం : పెన్‌పహాడ్ మండల సింగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నాగమణి, హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మాధవి (9), కుమారుడు హర్షవర్ధన్ (6) పిల్లలు ఉన్నారు. సూర్యాపేటలోని విద్యానగర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో పిల్లలతో కలిసి నాగమణి ఆత్మహత్య చేసుకోవాలని సూర్యాపేటలోని సద్దల చెరువు కట్టపైకి చేరుకుంది. మొదట పిల్లలిద్దరినీ చెరువులోకి తోసేసింది. ఆ తర్వాత తానూ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడాలనుకుంది. ధైర్యం సరిపోక అక్కడే కూర్చొని ఏడుస్తుంది. తెల్లవారేంత వరకు కూర్చోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హర్షవర్ధన్, మాధవి మృతదేహాలను వెలికి తీశారు. మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని.. ప్రశాంత్ కుమార్ మరో మహిళతో సహజీవనం చేస్తుండ డాన్ని నాగమణి తెలుసుకుంది. దీంతో అప్పటినుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై నాగ మణి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా వారిద్దరి మధ్య పెద్దగా సఖ్యత లేదు. పిల్లలను సాకేందుకు భారమవడంతో నాగమణి చేసేదేమి లేక తనువు చాలించాలని నిర్ణయించుకుంది. సద్దల చెరువు సమీపంలోకి వచ్చిన నాగమణి ముందుగా చిన్నారులను నీటిలోకి నెట్టేసి తరువాత ఈమె దూకాలనుకుంది. కానీ అప్పటికే చిన్నారులను చెరువులోకి నెట్టినప్పటికి ఈమెకు ధైర్యం చాలలేదు. చెరువులో ఉన్న చిన్నారులను కాపాడేందుకు రాత్రంతా తీవ్ర ప్రయత్నం చేసింది. తీరా తెల్లారేసరికల్లా చిన్నారులు విగత జీవులుగా మారారు. అమ్మతనంపై మమకారం చెరువులో పడ్డాక చిన్నారులపై చూపించాలనుకుంది. భార్యపై భర్త దాడి.. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చిన్నారుల మృతదేహాలను చూసి రోదిస్తున్న తల్లిపై భర్త దాడి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని భార్యభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నట్లు సూర్యాపేట సీఐ ఆంజనేయులు తెలిపారు. -
దాయాదులే నిందితులు..!
సాక్షి, భువనగిరి: అనుమానం పెనుభూతమైంది. తన భార్యకు చేతబడి చేయడంతోనే అనారోగ్యం బారిన పడిందని అనుమానించాడు. అందుకు కారణమైన వ్యక్తిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అదునుచూసి వెంబడించి వేటాడి ఘాతుకానికి ఒడిగట్టాడు. వలిగొండ మండలం సంగెం గ్రామానికి చెందిన బోయిని శంకరయ్యను దాయాదులే మట్టుబెట్టారని పోలీసుల విచారణలో వెల్లడైంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామ శివా రులో ఈ నెల 23న చోటు చేసుకున్న హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యోదంతా నికి పాల్పడిన నలుగురు నిందితులను శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మీడియా ఎదుట ప్రవేశపెట్టి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని వలిగొండ గ్రా మానికి చెందిన బోయిన ఎట్టయ్య కుమారుడు శంకరయ్య(62) ఒగ్గు కథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఎట్టయ్య పాలివారైన బోయిని బుచ్చయ్య కుమారుడు శంకరయ్య 20ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి చికెన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బంధువు చనిపోతే.. రెండేళ్ల క్రితం గ్రామానికి చెందిన బోయిన ఎట్టయ్య, బుచ్చయ్య బంధువు చనిపోయాడు. అంత్యక్రియలకు హైదరాబాద్‌లో ఉంటున్న శంకరయ్య కుటుంబంతో సహా హాజరయ్యాడు. ఆ సందర్భంలో శంకరయ్య వరుసకు కుమారుడైన శంకరయ్య భార్య చెవులను పట్టుకుని మాట్లాడాడు. అప్పటినుంచి శంకరయ్య భార్యకు చెవులు లాగడం, కడుపులో నొప్పిగా ఉండడం ఇతరత్ర అనారోగ్యాల బారిన పడింది. అయితే తన భార్య అనారోగానికి వరుసకు బాబాయి అయిన శంకరయ్య చేతబడి చేయడమే కారణమని భావించాడు. కక్ష పెంచుకుని.. తన భార్య అనారోగ్యం భారిన పడడానికి బాబాయి శంకరయ్యే కారణమని శంకరయ్య కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అంతమొందించాలని శంకరయ్య నిర్ణయించుకున్నాడు. అందుకు అదునుకోసం వేచి చూస్తున్నాడు. కొ ద్దిరోజులుగా శంకరయ్య కదలికలపై నిఘా పెట్టించాడు. ఒక్కడి వల్ల కాదని.. అయితే, బాబాయి శంకరయ్యను హత్య చేయడం తన ఒక్కడి వల్ల కాదని భావించిన శంకరయ్య తన చికెన్ దుకాణంలో పనిచేసే టేచౌత సాయికిరణ్, సంగెం గ్రామానికే చెందిన బోయిని ప్రభాకర్, బోయిని యాదయ్యలను ఆశ్రయించాడు. వరుసకు బాబాయి అయ్యే శంకరయ్యను హత్య చేసేందుకు సహకరించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంటాడి.. వేటాడి.. సంగెం గ్రామానికి చెందిన శంకరయ్య ఈ నెల 23(శుక్రవారం)న చౌటుప్పల్ మండలం వాయిళ్లపల్లి గ్రామంలో ఓ ఇంట్లో ఒగ్గుకథ చెప్పేం దుకు ఉదయం వెళ్లాడు. అప్పటికే సమాచారం ఉన్న శంకరయ్య హైదరాబాద్ నుంచి స్కార్పియో వాహనంలో తన దుకారణంలో పనిచేసే సాయికిరణతో కలిసి చౌటుప్పల్‌కు చేరుకున్నాడు. అక్కడ ఉన్న సంగెం గ్రామానికి చెందిన ప్రభాకర్, యాదయ్యలను కలుసుకున్నాడు. శంకరయ్య వాయిళ్లపల్లికి కథ చెప్పడానికి వెళ్లాడని తెలుసుకుని అక్కడే మాటేశారు. ఒగ్గుకథ పూర్తయిన తర్వాత శంకరయ్య ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. అదే దారిలో స్కార్పియో వాహనంలో కాపుకాసిన నలుగురు వ్యక్తులు శంకరయ్యను వెంబడించారు. సరిగ్గా సంగెం గ్రామ శివారులోకి రాగానే శంకరయ్య బైక్‌ను స్కార్పియోతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శంకరయ్య బైక్‌పైనుంచి ఎగిరి కిందపడడంతో వెంటనే స్కార్పియో నుంచి దిగిన శంకరయ్య, సాయికిరణ్ కత్తులతో అతడి గొంతు కోసేశారు. అనంతరం చెవులను కోసుకుని అక్కడినుంచి అదే వాహనంలో పరారయ్యారు. కాసేపు రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన శంకరయ్య ప్రాణాలు విడిచాడు. అనుమానంతో అదుపులోకి తీసుకోగా.. శంకరయ్య తండ్రి ఎట్టయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే మొదట శంకరయ్య ఒంటిపై ఉన్న ఆభరణాల కోసమే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావించారు. అయితే హత్య చేసిన అనంతరం బుచ్చయ్య కుమారుడు శంకరయ్యపై పోలీసులకు అనుమానం కలిగింది. స్కార్పియో వాహనంలో ఆదివారం అతడు సాయికిరణ్‌తో కలిసి హైదరాబాద్‌కు వెళుతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. హత్యోదంతంలో పాల్గొన్న బోయిని ప్రభాకర్, యాదయ్యలను కూడా అరెస్ట్ చేసి కేసు నమో దు చేసినట్టు డీసీపీ వివరించారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఏసీపీ సత్తయ్య, రామన్నపేట సీఐ శ్రీనివాస్, స్థానిక ఎస్ఐ శివనాగప్రసాద్,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు . -
గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య
కొత్తకోట: మానసిక స్థితి సరిగా లేని ఓ వృద్దుడు గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘంటన వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక బుడగజంగాల కాలనీకి చెందిన రామస్వామి(70), అచ్చమ్మలు దంపతులు. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలందరూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా రామస్వామి మానసికస్థితి సరిగా లేక జీవసమాధి అవుతానంటూ కుటుంబీకులను బెదిరించేవాడు. ఈ క్రమంలో పెద్ద కొడుకు శివ, కోడలు పద్మలతో రామస్వామి తరచూ గొడవపడేవాడు. మూడు రోజుల క్రితం పద్మను రామస్వామి గాయపరచడంతో పెద్దలు మందలించారు. ఆదివారం ఉదయం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రామస్వామి కూరగాయలు తరిగే కత్తితో గొంతు కోసుకున్నాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే క్షతగాత్రుడిని ప్రైవేటు వాహనంలో వనపర్తికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలోనే రామస్వామి మృతిచెందాడని ఏఎస్సై సత్తార్ తెలిపారు. -
కుటుంబ కలహాలకు ముగ్గురు బలి
మైలార్‌దేవ్‌పల్లిలో ఘటన హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ గృహిణి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను రక్షించే క్రమంలో భర్త, కుమారుడు మృత్యువాత పడ్డారు. ఇద్దరు కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. కిరాణా స్టోర్ నడుపుకొనే మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మీగూడకి చెందిన ఎలుక కృష్ణగౌడ్(34), సరిత(27) దంపతులు. వీరికి అక్షిత(5), ఐశ్వర్య(3), అశ్విన్ (ఏడాదిన్నర) సంతానం. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్న వీరి కుటుంబంలో కలహాలు తలెత్తాయి. ఈ క్రమంలో సరిత శుక్రవారం రాత్రి భర్తతో గొడవ పడ్డారు. గొడవ పెరిగి పెద్దదై, చివరకు జీవితంపై విరక్తిచెందిన సరిత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. రక్షించేందుకు వెళ్లిన భర్తను సరిత గట్టిగా పట్టుకోవడంతో అతడికి, పక్కనే ఉన్న అశ్విన్‌కు మంటలు అంటుకున్నాయి. చిన్నారి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు. భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అశ్విన్ మరణించాడు. ఘటనా స్థలిలోనే ఉన్న అక్షిత, ఐశ్వర్యలకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రుల మృతితో కుమార్తెలిద్దరూ అనాథలయ్యారు. స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి సానెం శ్రీనివాస్‌గౌడ్ తదితరులు మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. -
పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
కుటుంబ కలహాలతో భార్యా భర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం చిక్కడపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దంపతులు నక్క చిన్నప్ప(54), భూమవ్వ(48)ల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిన్నప్ప తండ్రితో వీరికి ఆస్తికి సంబంధించిన విషయంపై వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్యాభర్తలు బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
బావిలో మృతదేహం లభ్యం
కంబదురు(అనంతపురం): కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కంబదురు మండలం తిమ్మాపూర్ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన రాజశేఖర్(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో మూడు రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల కిందటే దూకి ఉంటాడని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కుమారుడి సమాధి వద్దే తండ్రి బలవన్మరణం
ఆదిలాబాద్(కోటపల్లి): కుమారుడి మరణం తట్టుకోలేక ఓ తండ్రి కుమారుడి సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోటపల్లి మండలం షెట్‌పల్లిలోచోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన మోతె మదనయ్య(60)కు మోతె రవి(30) ఒక్కగానొక్క కుమారుడు. కుటుంబ కలహాల కారణంగా గతేడాది రవి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతి తట్టుకోలేక అప్పటి నుంచి ఓ పిచ్చివాడిలా తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు. పురుగుల మందు తాగి కుమారుడి సమాధి వద్ద ఆదివారం విగతజీవిగా పడి ఉన్నాడు. మదనయ్య చనిపోయినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కత్తులతో దాడి... యువకుడి మృతి
శ్రీరాంపూర్ (ఆదిలాబాద్): కుటుంబ కలహాలు ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీశాయి. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం కోల్కెమికల్ కాంప్లెక్స్ పరిధిలోని ప్రశాంతి నగర్లో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కె.సురేందర్ (24) అనే వ్యక్తిని బంధువులైన ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడిచారు. నిందితులు కత్తులతో విచక్షణా రహితంగా పొడవడంతో సురేందర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీనికి కుటుంబ కలహాలే కారణమని స్థానికుల చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.