కుటుంబ కలహాలతో భార్యా భర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం చిక్కడపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన దంపతులు నక్క చిన్నప్ప(54), భూమవ్వ(48)ల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిన్నప్ప తండ్రితో వీరికి ఆస్తికి సంబంధించిన విషయంపై వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్యాభర్తలు బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.