శ్రీరాంపూర్ (ఆదిలాబాద్): కుటుంబ కలహాలు ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీశాయి. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం కోల్‌కెమికల్ కాంప్లెక్స్ పరిధిలోని ప్రశాంతి నగర్‌లో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కె.సురేందర్ (24) అనే వ్యక్తిని బంధువులైన ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడిచారు.
నిందితులు కత్తులతో విచక్షణా రహితంగా పొడవడంతో సురేందర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీనికి కుటుంబ కలహాలే కారణమని స్థానికుల చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.