ఏలూరు (పశ్చిమగోదావరి జిల్లా) : ఏలూరు పట్టణంలోని చేపలతూము సెంటర్ వద్ద చిన్నికృష్ణ(34) అనే వ్యక్తిపై ఐదుగురు వ్యక్తులు శుక్రవారం కత్తితో దాడి చేశారు. పాతకక్షల నేపథ్యంలోనే దాడి జరిగినట్లు తెలిసింది. ఈ దాడిలో ఓ కార్పొరేటర్ భర్త భీమవరపు సురేష్‌తో పాటు మీసాల దుర్గారావు, మేకల కిట్టు, చిప్పాడ సాయి, జగదీశ్ అనే నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన చిన్నికృష్ణను మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు.