హైదరాబాద్ : హైదరాబాద్ బంజారాహిల్స్ బోలక్ నగర్ లో అర్థరాత్రి జరిగిన హత్య కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూ వివాదం కారణంగా నయీంఖాన్ అనే వ్యక్తిపై నలుగురు యువకులు దాడి చేసి, హతమార్చిన విషయం తెలిసిందే. ఇందుకు సబంధించి ఇద్దరు నిందితులు రబ్బానీ, షరీఫ్లను పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.