హైదరాబాద్ : హైదరాబాద్ బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి రియల్ మాఫియా బుసలు కొట్టింది. ఓ స్థల వివాదం విషయంలో ఎక్స్ సర్వీస్‌మెన్ నయీం ఖాన్‌పై ముగ్గురు దుండగులు దాడిచేశారు. కత్తి నయీం కణతలో దిగడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
బోలక్ నగర్‌లోని 600 గజాల స్థలం విషయంలో మృతుడు నయీంకు స్థానికంగా ఉండే ఇమ్రాన్‌కు ఏడాది కాలంగా గొడవ జరుగుతుంది. ప్రస్తుతం ఆ కేసు వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న అక్కసుతోనే నయీంను చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.