అనుమానంతో రెండు హత్యలు | Man kills brother | Sakshi
Sakshi News home page

అనుమానంతో రెండు హత్యలు

Published Tue, Dec 22 2015 3:10 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Man kills brother

కమ్మదూర (అనంతపురం) : తోడబుట్టిన అన్న తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో అన్నను నరికి చంపి, భార్యపై కత్తితో దాడి చేసిన సంఘటన అనంతపురం కమ్మదూరలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. గిరిధర్, శంకరమ్మలు కమ్మదూరలో జీవిస్తున్నారు. అన్న వన్నూరు స్వామితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే  అనుమానం గిరిధర్కు బలంగా ఉండేది.

ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం భార్య శంకరమ్మ, అన్న వన్నూరు స్వామిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో వన్నూరు స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య కొన ఊపరితో ఉండగా ఆసుపత్రికి తరలించారు. అయితే కొద్దిసేపటికే  పరిస్థితి విషమించి భార్య కూడా మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement