పరారీలో నిందితుడు ఢిల్లీ బాబు, మారణాయుధాలు
చిత్తూరు: ప్రియురాలిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన దారుణ ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పనుమూరు మండలం ఎంపర్ల కొత్తూరుకు చెందిన ఢిల్లీ బాబు, గాయత్రి అనే ప్రేమజంట రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికి గాయత్రి మైనర్ కావడంతో ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. దీంతో అప్పటినుంచి గాయత్రి ప్రియుడు ఢిల్లీబాబును దూరం పెడుతూ వచ్చింది. ఇది జీర్జించుకోలేని యువకుడు ప్రియురాలు గాయత్రిపై ద్వేషం పెంచుకొని ఆమెపై 15 సార్లు కత్తితో దాడిచేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరిన గాయత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిలో నిందితుడు ఉపయోగించిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రేమోనాద్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని గాయత్రి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడి ఇంటిపై దాడిచేసి ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పంటించేశారు. అంతేకాకుండా అతడి తండ్రిపై కూడా బాధితురాలి కుటుంబసభ్యులు దాడి చేయడంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment