తడ: తనను వేధించిన వ్యక్తులతో పాటు వారికి సహకరించిన మరో ముగ్గురిపై ఓ యువతి కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. రాష్ట్ర సరిహద్దులో తమిళనాడు పరిధిలోని గుంపిలి గ్రామంలో గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. ఆరంబాకం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంపిలి గ్రామంలో జీవిత అనే యువతి పట్ల అదే గ్రామానికి చెందిన ఇద్దరు బుధవారం అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై ఆమె ఆరంబాకం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
డీఎస్‌పీ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలకు రాజీ చేస్తూ ఒకే గ్రామానికి చెందినవారు కాబట్టి సర్దుకు పోవాలని చెప్పి పంపారు. పోలీసులు, గ్రామపెద్దలు తమకు న్యాయం చేయలేదని బాధితురాలి కుటుంబం ఆవేదన చెందింది. ఈ విషయమై గురువారం గ్రామంలో మళ్లీ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో జీవిత తన కుటుంబసభ్యులతో కలసి కత్తితో దాడిచేసింది. ఈ దాడిలో ఓ మహిళ సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళను చెన్నై ప్రభుత్వాస్పత్రికి, మిగిలిన వారిని పొన్నేరికి తరలించారు. తమిళనాడు పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.
‘వేధించిన వ్యక్తులను కత్తితో నరికింది'
Published Fri, Jan 13 2017 10:37 AM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
Advertisement
Advertisement