jevitha
-
వైఎస్ఆర్సీపీలో చేరిన జీవితా రాజశేఖర్ దంపతులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన జీవితా రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని సోమవారం ఉదయం ప్రముఖ నటుడు జీవితా రాజశేఖర్ దంపతులు కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఈ భేటీ జరిగింది. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ...‘చాలా రోజుల తర్వాత వైఎస్ జగన్‌ను కలిశాను. మా మధ్య ఉన్న కొన్ని మనస్పర్థలు ఈ రోజుతో తొలగిపోయాయి. అప్పట్లో నేను అపరిపక్వతతో ప్రవర్తించాను. నాకు శత్రుత్వం లేదు, కానీ ఎందుకో మనస్పర్థలు ఉన్నాయి. అవి తొలగించుకోవడానికే ఆయన దగ్గరకు వచ్చాను. అప్పటి జగన్ ఇప్పటి జగన్ వేరు. ఇప్పటికే ఆయనను కలవడం ఆలస్యం అయింది. యువకుడైన వైఎస్ జగన్‌కు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు మా వంతు కృషి చేస్తాం.’ అని అన్నారు. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతు..ఎన్నికల ముందు ఇచ్చే డబ్బులు, చీరలకు ఆశపడద్దని ఓటర్లకు సూచించారు. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే అది వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు. కష్టపడకుండా కొడుకును సీఎంను చేయాలనుకునేవారు మనకొద్దని, జగన్‌లాంటి కష్టపడేవాళ్లు మనకు కావాలని జీవిత అన్నారు. -
‘వేధించిన వ్యక్తులను కత్తితో నరికింది'
తడ: తనను వేధించిన వ్యక్తులతో పాటు వారికి సహకరించిన మరో ముగ్గురిపై ఓ యువతి కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. రాష్ట్ర సరిహద్దులో తమిళనాడు పరిధిలోని గుంపిలి గ్రామంలో గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. ఆరంబాకం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంపిలి గ్రామంలో జీవిత అనే యువతి పట్ల అదే గ్రామానికి చెందిన ఇద్దరు బుధవారం అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై ఆమె ఆరంబాకం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలకు రాజీ చేస్తూ ఒకే గ్రామానికి చెందినవారు కాబట్టి సర్దుకు పోవాలని చెప్పి పంపారు. పోలీసులు, గ్రామపెద్దలు తమకు న్యాయం చేయలేదని బాధితురాలి కుటుంబం ఆవేదన చెందింది. ఈ విషయమై గురువారం గ్రామంలో మళ్లీ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో జీవిత తన కుటుంబసభ్యులతో కలసి కత్తితో దాడిచేసింది. ఈ దాడిలో ఓ మహిళ సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళను చెన్నై ప్రభుత్వాస్పత్రికి, మిగిలిన వారిని పొన్నేరికి తరలించారు. తమిళనాడు పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.