పీక కోస్తా! | This pic of Samantha holding a butcher's knife will give you chills | Sakshi
Sakshi News home page

పీక కోస్తా!

Published Sat, Feb 25 2017 1:20 AM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

పీక కోస్తా!

పీక కోస్తా!

సమంతలాంటి సుకుమారి సున్నితంగా మల్లెపువ్వునో, గులాబీలనో కోస్తే చూడ్డానికి బాగుంటుంది కానీ, మనిషి పీక కోస్తే? అలాంటి సీరియస్‌ రోల్‌లో ఈ బ్యూటీని చూడబోతున్నాం. ప్రస్తుతం సమంత చేస్తున్నవాటిలో ఓ తమిళ సినిమా ఉంది. ఆ చిత్రంలోనే ఆమె ఇలాంటి పాత్రలో కనిపించనున్నారు. త్యాగరాజన్‌ కుమార రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘అనీది కథైగళ్‌’ అనే టైటిల్‌ పెట్టాలనుకుంటున్నారట.

ఇక్కడ ఫొటోలో సమంత చేత్తో కత్తితో ఓ వ్యక్తిని హత్య చేయడానికి ప్రయత్నిçస్తున్న దృశ్యం ఆ సినిమాలోదే. ‘ఇంద్ర’లో ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అని చిరంజీవి అన్నట్లు.. ఈ చిత్రంలో ‘నాతో పెట్టుకుంటే పీక కోస్తా’ అని సమంత అంటారేమో. ఇది రొమాంటిక్‌ కామెడీ మూవీ. ఇందులో సమంత క్యారెక్టర్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని దర్శకుడు అంటున్నారు. స్టిల్‌ చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది కదూ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement