గుర్తుతెలియని దుండగులు ఒక వ్యక్తిని కత్తితో అతిదారుణంగా గోంతు కోసి చంపారు.
గిద్దలూరు: గుర్తుతెలియని దుండగులు ఒక వ్యక్తిని కత్తితో అతిదారుణంగా గోంతు కోసి చంపారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు హార్టికల్చర్ ఫాం వద్ద సోమవారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి... కర్నూలు జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన ఎస్‌కే జాకీర్‌హుస్సేన్(27) అరటిపండ్ల వ్యాపారం చేసేవాడు. సోమవారం కూడా ఎప్పటిలాగే ఆటోతో బేరానికి వెళ్లాడని అతని తల్లదండ్రులు చెప్తున్నారు. తన కొడుకుకు ఎవరితోనూ గొడవలు లేవని మృతుడి తండ్రి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.